Fake News, Telugu
 

ఈ ఫోటో ఇప్పుడు పాకిస్తాన్ లో ఆర్మీకి , పోలీసులకి మధ్య జరుగుతున్న గొడవలకి సంబంధించింది కాదు.

0

పాకిస్తాన్ లోని పెషావర్ లో సైనికుడ్ని కొడుతున్న పోలీసులు, పోలీసులకు సాయంగా ప్రజలు కూడా సైనికుల మీద ఒక చెయ్యేస్తున్నట్టు చెప్తూ, దీనికి సంబంధించిన ఫోటో ఒకటి  షేర్ చేసిన  పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పాకిస్తాన్ లో ఒక సైనికున్ని పోలీసులు కొడుతుండగా ప్రజలు సైనికులకు మద్దతు తెలుపుతున్న ఫోటో. 

ఫాక్ట్(నిజం): ఈ ఫోటో 2016 పాకిస్తాన్ లోని ఖైబర్-పఖ్తున్ఖ్వా లో నేషనల్ హైవే అండ్ మోటార్వే పోలీసులపై పాకిస్తాన్ సైనికులు దాడి చేసిన ఘటనకి సంబంధించింది. ఈ ఫోటోకి  ఇప్పుడు పాకిస్తాన్ లో ఆర్మీకి , పోలీసులకి మధ్య జరుగుతున్న గొడవలకి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో ఉన్న ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని ప్రచురించిన 2016 వార్తా కథనం ఒకటి మాకు దొరికింది. ఈ కథనం ప్రకారం ఈ ఫోటో పాకిస్తాన్ లోని ఖైబర్-పఖ్తున్ఖ్వా ప్రావిన్స్ లోని జహాంగీర టౌన్ లో రాష్ డ్రైవింగ్ చేస్తున్న సైనికుల్ని నేషనల్ హైవే అండ్ మోటార్వే పోలీసులు(NHMP) అడ్డుకున్నప్పుడు వారిపై  సైనికులు దాడి చేసిన ఘటనకి సంబంధించినవి. ఈ ఘటనపై NHMP DIG రాసిన రిపోర్ట్ కూడా ఇదే విషయాన్ని తెలుపుతుంది. ఈ ఘటనకి సంబంధించి మరొక వార్తా  కథనం ఇక్కడ చదవొచ్చు.

ఈ విషయాన్నీ ధ్రువీకరిస్తూ పాకిస్తాన్ ఆర్మీ అధికారిక మీడియా విభాగమైన ISPR తమ ఫేస్ బుక్ అకౌంట్ లో ఒక పోస్ట్ చేసింది. ఈ పోస్టుని ఇక్కడ చూడొచ్చు. ఈ ఘటనపై సంబంధించిన న్యూస్ వీడియోస్ ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. దీన్నిబట్టి ఈ ఫోటో పాతదని, ఇప్పుడు పాకిస్తాన్ లో పోలీసులకి, ఆర్మీకి మధ్య జరుగుతున్న గొడవలకి సంబంధించినది కాదని కచ్చితంగా చెప్పొచ్చు. 

ఇటివలి కాలంలో పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో పోలీసులకి, ఆర్మీ కి మధ్య జరుగుతున్న గొడవల నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, ఈ ఫోటో 2016 పాకిస్తాన్ లోని ఖైబర్-పఖ్తున్ఖ్వా లో నేషనల్ హైవే అండ్ మోటార్వే పోలీసులపై పాకిస్తాన్ సైనికులు దాడి చేసిన ఘటనకి సంబంధించింది.

Share.

About Author

Comments are closed.

scroll