Fake News, Telugu
 

ఈ ఫోటోలో ఉన్నది 1400 సంవత్సరాల క్రితం నిర్మించిన శివాలయంలో ఉన్న కంప్యూటర్ మరియు కీ-బోర్డు శిల్పం కాదు

0

1400 సంవత్సరముల క్రితం పల్లవ రాజు రెండవ నరశింహవర్మ కర్ణాటకలోని తలగిరిలో శివాలయము నిర్మించారు. ఈ ఆలయ శిల్పాలలో కంప్యూటర్ ను కీ-బోర్డుతో సహా ఉన్న శిల్పం ఎంతో ఆకర్షణగా ఉంది.”, అని చెప్తూ ఒక ఫోటోని సోషల్ మీడియాలో కొంత మంది చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 1400 సంవత్సరాల క్రితం పల్లవ రాజు రెండవ నరశింహవర్మ కర్ణాటకలోని తలగిరిలో నిర్మించిన శివాలయం యొక్క శిల్పాలలో కంప్యూటర్ మరియు కీ-బోర్డుతో సహా ఉన్న ఒక శిల్పం యొక్క ఫోటో.

ఫాక్ట్: ఫోటోలో ఉన్నది కర్ణాటకలోని శివాలయంలో ఉన్న ఒక శిల్పం కాదు. అది రౌల్ క్రూజ్ అనే ఒక ఆర్టిస్ట్ గీసిన బొమ్మ. అంతేకాదు, పోస్ట్‌లో చెప్పినట్టు అది 1400 సంవత్సరాల క్రితం నిర్మించిన శిల్పం కాదు, ఈ మధ్య కాలంలో (2006లో) గీసిన బొమ్మ. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, అలాంటి ఫోటోలే సెర్చ్ రిజల్ట్స్‌లో చాలా వచ్చాయి. ‘Cosmos Latinos’ అనే పుస్తకం యొక్క కవర్ మీద అదే ఫోటో ఉన్నట్టు చూడవచ్చు. ఆ ఫోటోలో ఉన్న బొమ్మని గీసింది రౌల్ క్రూజ్ అనే ఒక ఆర్టిస్ట్ అని ఆ పుస్తకం వెనకాల ఉన్నట్టు చదవచ్చు. ఇదే విషయం మరో వెబ్‌సైట్‌లో కూడా చూడవచ్చు. కాబట్టి, ఫోటోలో ఉన్నది కర్ణాటకలోని శివాలయంలో ఉన్న ఒక శిల్పం కాదు.

రౌల్ క్రూజ్ యొక్క వివిధ సోషల్ మీడియా అకౌంట్లలో కూడా అలాంటి ఫోటోలే ఉన్నట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. పోస్ట్‌లో చెప్పినట్టు అది 1400 సంవత్సరాల క్రితం నిర్మించిన శిల్పం కాదు, ఈ మధ్య కాలంలో గీసిన బొమ్మ.

చివరగా, ఫోటోలో ఉన్నది రౌల్ క్రూజ్ అనే ఒక ఆర్టిస్ట్ గీసిన బొమ్మ, 1400 సంవత్సరాల క్రితం నిర్మించిన శివాలయంలో ఉన్న కంప్యూటర్ మరియు కీ-బోర్డు శిల్పం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll