‘మొబైల్ ఫోన్‌లో ఎక్కువ సేపు ఆటలు ఆడటం ద్వారా కళ్ళలోకి వచ్చిన పరాన్నజీవి అనే పురుగును తొలగించే దృశ్యం,’ అని అంటూ, ఒక వీడియోతో ఉన్న పోస్టును బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: మొబైల్ ఫోన్‌లో ఎక్కువసేపు ఆటలు ఆడటం ద్వారా కళ్ళలోకి వచ్చిన పరాన్నజీవి అనే పురుగును తొలగించే వీడియో.
ఫాక్ట్: కళ్ళలోకి వచ్చిన పరాన్నజీవి అనే ఈ పురుగు మొబైల్ ఫోన్‌లో ఎక్కువసేపు ఆటలు ఆడటం వల్ల రాలేదు. ఈ వీడియోలో కంటి నుండి పొడవైన లోవా లోవా పురుగును (20 సెం. మీ పొడవు) శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తున్నారు. ఆఫ్రికన్ కంటి పురుగు అని పిలువబడే లోయాసిస్, పరాన్నజీవి పురుగు లోవా లోవా వల్ల కలుగుతుంది. ఇది క్రిసోప్స్ ప్రజాతి యొక్క జింకఈగలు (మామిడి ఈగలు లేదా మడ అడవుల ఈగలు అని కూడా పిలుస్తారు) యొక్క కాటు ద్వారా మనుషులకు సంక్రమిస్తుంది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే వీడియో యూట్యూబ్‌లో లభించింది. 20 ఏప్రిల్ 2013లో అప్లోడ్ చేసిన ఈ యూట్యూబ్ వీడియోను 0.16 టైం దగ్గర క్లిప్ చేసి, ఆడియోను తీసేసి, పోస్ట్ ద్వారా 3.08 నిమిషాల నిడివిగల వీడియోను తయారు చేసినట్టు తెలుస్తుంది. ఈ యూట్యూబ్ వీడియోను గనక మొత్తం చూసినట్లయితే, కంటి నుండి పొడవైన లోవా లోవా పురుగును (20 సెం.మీ పొడవు) శస్త్రచికిత్స ద్వారా తొలగించబడుతుంది అని వీడియోలో డాక్టర్ అన్నట్టుగా చూడొచ్చు. ఈగలు కాటు వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది అని అందులో డాక్టర్ అన్నట్టుగా చూడొచ్చు. మొబైల్ ఫోన్ ఇక్కడ కారణం అనే ప్రస్తావన వీడియోలో రాలేదు.
ఆఫ్రికన్ కంటి పురుగు అని పిలువబడే లోయాసిస్, పరాన్నజీవి పురుగు లోవా లోవా వల్ల కలుగుతుంది. ఇది క్రిసోప్స్ ప్రజాతి యొక్క జింక ఈగలు (మామిడి ఈగలు లేదా మడ అడవుల ఈగలు అని కూడా పిలుస్తారు) యొక్క కాటు ద్వారా మనుషులకు సంక్రమిస్తుంది. పశ్చిమ మరియు మధ్య ఆఫ్రికాలోని కొన్ని వర్షపు అడవుల్లో ఇది మనము ఎక్కువగా చూడొచ్చు. మొబైల్ ఫోన్‌లో ఎక్కువసేపు ఆటలు ఆడటం ద్వారా కళ్ళలోకి వచ్చిన పరాన్నజీవి అనే వాదనలో నిజంలేదు.
సైన్స్ డైలీ ప్రకారం, దీర్ఘకాలికంగా మొబైల్ ఫోన్‌లో గేమ్స్ ఆడటం డిప్రెషన్ కు దారితీయవచ్చు. కానీ, దాని వాడకం వల్ల కళ్ళలోకి పరాన్నజీవి వస్తాయి అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు.
చివరగా, కళ్ళలోకి వచ్చిన పరాన్నజీవి అనే ఈ పురుగు ఈగల కాటు వల్ల వచ్చింది, మొబైల్ ఫోన్‌లో ఎక్కువసేపు ఆటలు ఆడటం వల్ల కాదు.