Fake News, Telugu
 

సౌదీకి చెందిన వ్యక్తి ఒకే పాఠశాలకు చెందిన నలుగురు మహిళలను పెళ్లి చేసుకున్నాడంటూ షేర్ చేస్తున్న ఈ ఫోటో తప్పు

0

సౌదీకి చెందిన వ్యక్తి ఒకే పాఠశాలకు చెందిన విధ్యార్ధినిని, టీచర్‌ని, సూపర్‌వైజర్‌ని మరియు ప్రిన్సిపాల్‌ను ఒకే రోజు పెళ్లిచేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: సౌదీలో ఒక వ్యక్తి ఒకే పాఠశాలకు చెందిన విధ్యార్ధినిని, టీచర్‌ని, సూపర్‌వైజర్‌ని మరియు ప్రిన్సిపాల్‌ను పెళ్లిచేసుకున్నాడు.

ఫాక్ట్ (నిజం): 2016లో వివాహ డిజైన్లకు సంబంధించి జరిగిన ఒక ఫ్యాషన్ షోలో అమీన్ అల్-ఘోబాషి అనే జోర్డాన్ దేశానికి చెందిన వ్యక్తి తన భార్య మరియు ముగ్గురు మోడెల్స్‌తో కలిసి దిగిన ఫోటోని ఈ పోస్టులో షేర్ చేశారు. తన భర్త అమీన్ మరో పెళ్లి చేసుకోలేదని, తనతో ఫోటో దిగిన ముగ్గురు అమ్మాయిలు ఫ్యాషన్ షోలో పాల్గొన్న మోడెల్స్‌ అని అమీన్ భార్య డాక్టర్ ఖోలౌద్ మిడియాకి స్పష్టం చేశారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఈ ఫోటోకి సంబంధించి పలు అరబిక్ వార్తా సంస్థలు 2016లో పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ దొరికాయి. మొదటి భార్య విడిపోతూ తనకు జీవితంలో మరొక అమ్మాయి భార్యగా దొరకదని అవమానించడంతో కోపంతో ఒక యువకుడు నలుగురు అమ్మాయిలని పెళ్లిచేసుకొని ఫోటో దిగాడని ‘అల్-రై’ అనే వార్తా సంస్థ రిపోర్ట్ చేసిందని, కానీ ఈ వార్త పూర్తిగా అవాస్తమని ఈ వార్తా సంస్థలు తమ ఆర్టికల్స్‌లో రిపోర్ట్ చేశాయి.  

వివాహ డిజైన్లకు సంబంధించి ‘ది బ్రైడ్’ పేరుతో జరిగిన ఒక ఫ్యాషన్ షోలో అమీన్ అల్-ఘోబాషి అనే జోర్డాన్ దేశానికి చెందిన వ్యక్తి తన భార్య మరియు ముగ్గురు మోడెల్స్‌తో కలిసి దిగిన ఫోటో ఇదని తెలిసింది. తన భర్త అమీన్ మరో పెళ్లి చేసుకోలేదని, తనతో ఫోటో దిగిన ముగ్గురు అమ్మాయిలు ఫ్యాషన్ షోలో పాల్గొన్న మోడెల్స్‌ మాత్రామే అని అమీన్ భార్య డాక్టర్ ఖోలౌద్ మిడియాకి స్పష్టం చేశారు. ఈ విషయాలను రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ చేసిన ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, సౌదీకి చెందిన వ్యక్తి ఒకే పాఠశాలకు చెందిన నలుగురు మహిళలను పెళ్లి చేసుకున్నాడంటూ షేర్ చేస్తున్న ఈ ఫోటో తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll