Fake News, Telugu
 

తిరుమల తిరుపతి దేవాలయంలో ఉద్యోగాల భర్తీ పేరుతో షేర్ చేస్తున్న ఈ నోటిఫికేషన్ ఫేక్

0

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల భర్తీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు నూతనంగా ఒక నోటిఫికేషన్ జారీ చేసింది, అంటూ సోషల్ మీడియాలో ఒక ప్రకటన ఫోటో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల భర్తీ కోసం టీటీడీ బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్ యొక్క ఫోటో.

ఫాక్ట్ (నిజం): సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఉద్యోగ నియామక ప్రకటన ఫేక్ అని టీటీడీ బోర్డు స్పష్టం చేసింది. టీటీడీలో ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ చేప‌ట్టేట‌ప్పు‌డు ముందుగా ప‌త్రిక‌ల్లో, టీటీడీ వెబ్‌సైట్‌లో అధికారిక  ప్ర‌క‌ట‌న (నోటిఫికేషన్) ఇవ్వ‌డం జ‌రుగుతుందని టీటీడీ బోర్డు స్పష్టం చేసింది. టీటీడీలో ఉద్యోగాలు పేరుతో గతంలో కూడా కొంతమంది దళారులు అమాయకుల దగ్గరనుండి డబ్బులు వసూలు చేసారని, ప్రజలు ఇలాంటి ఫేక్ ప్రకటనలకు మోసపోవద్దని టీటీడీ హెచ్చరించింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన స్పష్టత కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు వెబ్సైటులో వెతికితే, తిరుమల తిరుపతి దేవాలయంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీటీడీ బోర్డు ఇటీవల ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదని తెలిసింది. పోస్టులో షేర్ చేసిన ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌కు సంబంధించి టీటీడీ బోర్డు స్పష్టతనిస్తూ 05 డిసెంబర్ 2021 నాడు ఒక ప్రెస్ రిలీజ్ జారీ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్‌ ఫేక్ అని టీటీడీ బోర్డు ఈ ప్రెస్ రిలీజ్‌లో స్పష్టం చేసింది. 

టీటీడీలో ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ చేప‌ట్టేట‌ప్పు‌డు ముందుగా ప‌త్రిక‌ల్లో, టీటీడీ వెబ్‌సైట్‌లో అధికారిక  ప్ర‌క‌ట‌న (నోటిఫికేషన్) ఇవ్వ‌డం జ‌రుగుతుందని టీటీడీ బోర్డు తెలిపింది. టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని గతంలో కూడా కొంతమంది ద‌ళారులు మోసపు మాటలు చెప్పి కొంతమంది అమాయకుల నుండి డబ్బులు వసూలు చేసారని, అలాంటివారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు టీటీడీ బోర్డు స్పష్టం ఈ ప్రకటనలో తెలిపింది. ఇలాంటి అవాస్తవ ప్రకటనలు చూసి ప్రజలు మోసపోవద్దని టీటీడీ బోర్డు ఈ ప్రెస్ రిలీజ్‌ ద్వారా హెచ్చరించింది. ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ చేసిన ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉద్యోగాల భర్తీ పేరుతో జరిగిన అవాస్తవ ప్రచారాలకు సంబంధించి టీటీడీ బోర్డు గతంలో పబ్లిష్ చేసిన ప్రెస్ రిలీజ్‌లని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. టీటీడీ-BIIRD ఆసుపత్రిలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ కోసం టీటీడీ బోర్డు అక్టోబర్ నెలలో ఒక నోటిఫికేషన్ జారీ చేసినట్టు తెలిసింది. కానీ, ఉద్యోగాల భర్తీ కోసం టీటీడీ బోర్డు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఎక్కడా సమాచారం లేదు.

చివరగా, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల భర్తీ పేరుతో షేర్ చేస్తున్న నోటిఫికేషన్ ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll