Fake News, Telugu
 

బంగాళాఖాతంలో మునిగిన మత్స్యకారుల బోట్ వీడియోని పాపికొండల్లో జరిగిన బోటు ప్రమాదంగా ప్రచారం చేస్తున్నారు

0

కొంతమంది వ్యక్తులు ప్రయాణిస్తున్న బోట్ నీళ్ళల్లో మునుగుతున్న వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, అది ఇటీవల గోదావరి నదిలో మునిగిన టూరిస్ట్ బోట్ ది అంటూ చాలా మంది ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : పాపి కొండల్లో జరిగిన బోటు ప్రమాదం వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియో కొంతమంది మత్స్యకారులు బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లినప్పుడు వాతావరణం అనుకూలించక మరియు కఠినమైన సముద్ర పరిస్థితుల వల్ల వారు ప్రయాణిస్తున్న బోట్ మునిగినప్పటిది. కావున, పోస్టులో చెప్పింది అబద్ధం.

తూర్పు గోదావరి జిల్లా లోని దేవీపట్నం ప్రాంతం దగ్గర సెప్టెంబర్ 15, 2019న గోదావరి నదిలో టూరిస్ట్ బోట్ మునిగిందని ‘Firstpost’ వారు ప్రచురించిన కథనం ద్వారా తెలుసుకోవచ్చు. కానీ ప్రచారం చేస్తున్న వీడియో కి ఈ ప్రమాదానికి సంబంధం లేదు.

పోస్టులో ఉన్న వీడియో కి సంబంధించి అనేక స్క్రీన్ షాట్స్ తీసి, వాటిని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఆ వీడియో  బంగాళాఖాతంలో మత్స్యకారుల బోట్ మునిగినప్పటిదని చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. ఆ సమాచారంతో, యూట్యూబ్ లో కీవర్డ్స్ తో వెతికినప్పుడు, అదే వీడియో క్లిప్ ఆధారంగా ‘India Tv’ వారు ప్రసారం చేసిన న్యూస్ వీడియో లభించింది. ఆ వీడియో ద్వారా, జులై 2019లో బెంగాల్ కి చెందిన కొంతమంది మత్స్యకారులు బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లినప్పుడు, వాతావరణం అనుకూలించక మరియు కఠినమైన సముద్ర పరిస్థితుల వల్ల వారు ప్రయణిస్తున్న బోట్ మునిగిందని తెలిసింది.

కావున,  ఆ వీడియో గోదావరి నదిలో మునిగిన టూరిస్ట్ బోట్ ది కాదు, బంగాళాఖాతం లో మునిగిన బెంగాల్ మత్స్యకారుల బోట్ కి సంబంధించినది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll