ఒక ప్లేన్ విన్యాసాలు చేస్తున్న వీడియో ని ఫేస్బుక్ లో పెట్టి, అందులో కనిపించేది రఫెల్ యుద్ధ విమానమని ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో పరిశీలిద్దాం.
క్లెయిమ్: రఫెల్ యుద్ధ విమానం విన్యాసాలు చేస్తున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): వీడియో లో కనిపించేది F-16QQ టర్బైన్ జెట్. దానిని ‘ఫ్లెక్స్ ఇన్నోవేషన్స్’ సహ వ్యవస్థాపకుడు క్వికూ సోమెన్జిని అనే వ్యక్తి రిమోట్ తో ఆపరేట్ చేస్తున్నారు. ‘ఫ్లెక్స్ ఇన్నోవేషన్స్’ అనేది విమాన నియంత్రణ వ్యవస్థలు, బొమ్మలు, ఎలక్ట్రానిక్స్ మరియు RC హాబీ ప్రొడక్ట్స్ పై పని చేసే సంస్థ. కావున, పోస్టులో చెప్పింది అబద్ధం.
ఆ వీడియో కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ని యాండెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, చాలా సెర్చ్ రిజల్ట్స్ ‘F-16QQ’ గురించి వచ్చాయి.
దాంతో, గూగుల్ లో ‘F-16QQ’ అనే కీవర్డ్ తో వెతికినప్పుడు, చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. ఒక సెర్చ్ రెసుల్ట్ లో పోస్టులో పెట్టిన క్లిప్ కి సంబంధించిన పూర్తి వీడియో లభించింది. దానిని ‘ఫ్లెక్స్ ఇన్నోవేషన్స్’ అనే యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసింది. దాని క్రింద ‘Quique flies the F-16QQ on a hot day in August, Venice, FL!’ అనే వివరణ ఉంది. గూగుల్ లో ‘ఫ్లెక్స్ ఇన్నోవేషన్స్’ సంస్థ గురించి వెతికినప్పుడు, అది విమాన నియంత్రణ వ్యవస్థలు, బొమ్మలు, ఎలక్ట్రానిక్స్ మరియు RC హాబీ ప్రొడక్ట్స్ పై పని చేసే సంస్థ అని తెలిసింది. వీడియోలో కనిపించే జెట్ మీద కూడా ఆ కంపెనీ లోగో కనిపిస్తుంది.
ఆ కంపెనీ వెబ్‌సైట్‌లో F-16QQ టర్బైన్ జెట్ ని చూడవచ్చు. దానిని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం ద్వారా కొనుగోలు చేయవచ్చు.
ఒరిజినల్ వీడియోలో 6:19 నిడివి దగ్గర ఆ జెట్ ని ‘ఫ్లెక్స్ ఇన్నోవేషన్స్’ సంస్థ సహ వ్యవస్థాపకుడు క్వికూ సోమెన్జిని రిమోట్ తో ఆపరేట్ చేయడం కూడా చూడవచ్చు.
చివరగా, ఆ వీడియోలో విన్యాసాలు చేసే విమానం రఫెల్ ఫైటర్ జెట్ కాదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: వీడియోలో విన్యాసాలు చేస్తున్న విమానం రఫెల్ ఫైటర్ జెట్ కాదు - Fact Checking Tools | Factbase.us