Fake News, Telugu
 

స్విస్ నేషనల్ బ్యాంక్‌కు నష్టాలు రావడం ఇది మొదటిసారి కాదు

0

2016లో బీజేపీ ప్రభుత్వం భారత్‌లో పెద్ద నోట్లను రద్దు చేయడం వలన ఎప్పుడూ లాభాల్లో ఉండే స్విస్ బ్యాంక్‌కి 2022లో $143 బిలియన్ నష్టం వచ్చిందని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: భారత్‌లో పెద్ద నోట్లను రద్దు చేయడం వలన ఎప్పుడూ లాభాల్లో ఉండే స్విస్ బ్యాంక్‌కి 2022లో $143 బిలియన్ నష్టం వచ్చింది.

ఫాక్ట్: స్విస్ నేషనల్ బ్యాంక్‌కు నష్టాలు రావడం ఇది మొదటిసారి కాదు, ఇటీవల కాలంలో 2008, 2010, 2013, 2018 లలో ఈ బ్యాంక్ నష్టాలను నమోదు చేసింది. పైగా పెద్ద నోట్లు రద్దు చేసిన 2016లో మరియు 2017లో కూడా ఈ బ్యాంకు లాభాల్లో ఉంది. 2022 లో నష్టాలకు కారణం స్విస్ బ్యాంక్ స్టాక్ విలువ పడిపోవడం, ఫిక్సెడ్ ఇన్కమ్ మార్కెట్లు దెబ్బతినడం మరియు స్విస్ ఫ్రాంక్ బలపడటం అని reuters వెల్లడించింది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా స్విస్ నేషనల్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్లో ఇటీవల విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, 2022లో ఈ బ్యాంక్ నష్టం CHF 132 billion (CHF అనగా స్విట్జర్లాండ్ కరెన్సీ ‘స్విస్ ఫ్రాంక్’; ప్రస్తుతం CHF 1 = $1.09). ఇక, గతంలో స్విస్ బ్యాంక్ ప్రకటించిన వార్షిక నివేదికలలో  లాభనష్టాలు ఈ విధంగా ఉన్నాయి.

సంవత్సరoలాభ నష్టాలు (CHF బిలియన్లలో)
2022-132
202126.3
202020.9
201948.9
2018-14.9
201754.4
201624.5
201523.3
201438.3
2013-9.1
20126
201113
2010-20.8
200910
2008-4.7

పై పట్టిక ఆధారంగా, స్విస్ నేషనల్ బ్యాంక్‌కు నష్టాలు రావడం మొదటిసారి కాదు అని స్పష్టంగా చూడవచ్చు. నోట్ల రద్దు చేసిన ఏడాది 2016లో మరియు 2017లో కూడా ఈ బ్యాంక్‌కు లాభాలు వచ్చాయి. Reuters కథనం ప్రకారం, స్విస్ బ్యాంక్ స్టాక్ విలువ పడిపోవడం, ఫిక్సెడ్ ఇన్కమ్ మార్కెట్లు దెబ్బతినడం మరియు స్విస్ ఫ్రాంక్ బలపడటం వంటి కారణాల వలన 2022లో భారీ నష్టం వచ్చింది అని అంచనా వేశారు.

ఇక మీడియా కథనాల ప్రకారం 2020 చివరి నాటికి, స్విస్ బ్యాంకులలో భారతీయుల డిపాజిట్ల విలువ ₹20,700 కోట్ల రూపాయలు ఉంది, ఇది 13 ఏళ్ల గరిష్టం అని పేర్కొన్నాయి. అయితే, స్విస్ బ్యాంకులలో భారతీయుల డిపాజిట్లు పెరగటానికి కారణం నల్లధనం దాచుకోవడం వలన కాదు అని, అందుకు వివిధ ఆర్థిక మరియు వాణిజ్య కారణాలు ఉన్నాయి అని కేంద్ర ఆర్ధిక శాఖ తన వివరణలో పేర్కొంది.

చివరిగా, స్విస్ నేషనల్ బ్యాంక్‌కు నష్టాలు రావడం ఇది మొదటి సారి కాదు. పైగా పెద్దనోట్ల రద్దు చేసిన 2016లో మరియు 2017లో లాభాలు వచ్చాయి.

Share.

About Author

Comments are closed.

scroll