Fake News, Telugu
 

ఇది 19వ శతాబ్దంలో భారత దేశంలో తయారుచేయబడ్డ హనుమాన్ విగ్రహాం, అమెరికన్ దేవుడిది కాదు.

0

ఒక పురాతన హనుమాన్ విగ్రహం ఫోటో చూపిస్తూ, ఇది ఒబామా ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో బయటపడ్డ హనుమాన్ రూపంలో ఉండే  మఖర్ధ్వజ్ అనబడే అమెరికన్ దేవుడని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఒబామా ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో అమెరికాలో బయటపడ్డ హనుమాన్ రూపంలో ఉండే  మఖర్ధ్వజ్ అనబడే అమెరికన్ దేవుడు.

ఫాక్ట్(నిజం): ఇది 19వ శతాబ్దంలో భారత దేశంలో తయారుచేయబడ్డ హనుమాన్ విగ్రహాం. దినిని 1991లో అమెరికాలోని డెన్వర్ ఆర్ట్ మ్యూజియం వారు Adrian Maynard Oriental Art, London వద్దనుండి కొనుగోలు చేసారు. ఈ విగ్రహానికి ఒబామాకి ఎటువంటి సంబంధంలేదు. పోస్టులో చెప్పిన పుస్తకం హోండురాస్ దేశంలోని పురావస్తు ప్రదేశాలు కనుగొనేందుకు చేసిన ప్రయత్నాల గురించి మరియు 2012లో చేసిన ప్రయత్నంలో కనుగొన్న ఒక పురాతన సిటీ గురించి రాసింది. ఐతే ఈ పుస్తకానికి పోస్టులో ఉన్న హనుమాన్ విగ్రహానికి ఎటువంటి సంబంధంలేదు. ఈ విగ్రహాం పురావస్తు ప్రదేశాలు కనుగొనేందుకు చేసిన ప్రయత్నాల కన్నా చాలా ముందే (1800s) తాయారు చేయబడింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులోని హనుమాన్ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోకి సంబంధించి అమెరికాలోని డెన్వర్ ఆర్ట్ మ్యూజియంలో అందుబాటులో ఉన్న సమాచారం మాకు కనిపించింది. ఈ సమాచారం ప్రకారం ఈ ఫోటోలో ఉన్నది 19వ శతాబ్దంలో దక్షిణ భారత దేశంలో ( తమిళనాడు లేక కేరళ) ఒక గుర్తుతెలియని కళాకారుడు రిపొందించిన హనుమాన్ విగ్రహాం. ఈ విగ్రహాన్ని 1991లో డెన్వర్ ఆర్ట్ మ్యూజియం కొనుగోలు చేసినట్టు ఉంది. దీన్నిబట్టి ఈ విగ్రహాం ఒబామా ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో బయటపడలేదని కచ్చితంగా చెప్పొచ్చు.

ఐతే తనకు ఒక మహిళ ఇచ్చిన చిన్న హనుమాన్ విగ్రహం అప్పుడప్పుడు తన జేబులో ఉంచుకుంటానని ఒబామా ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పటికీ, తనకు హనుమాన్ అంటే భక్తీ ఉందని ఎప్పుడు చెప్పినట్టు ఆధారాలు లేవు. ఇంకా పోస్టులో ఉన్న విగ్రహానికి ఒబామాకి ఎటువంటి సంబంధంలేదు. ఈ విగ్రహాన్ని డెన్వర్ ఆర్ట్ మ్యూజియం వారు ఒబామా ప్రెసిడెంట్ కాకముందే కొనుగోలు చేసారు.

పోస్టులో చెప్తున్న పుస్తకం గురించి గూగుల్ లో వెతకగా ఈ పుస్తకం డగ్లస్ ప్రెస్టన్ అనే జర్నలిస్ట్ 2017లో హోండురాస్ దేశంలోని అడవుల కింద ఉన్న పురావస్తు ప్రదేశాలు కనుగొనేందుకు చేసిన ప్రయత్నాల గురించి, 2012లో చేసిన ప్రయత్నంలో అడవుల కింద కనుగొన్న ఒక పురాతన సిటీ గురించి రాసిందని తెలిసింది. ఈ సిటీని ‘సిటీ అఫ్ మంకీ గాడ్’ అని కూడా అంటారు. ఈ ప్రాంతంలోని అడవుల కింద ఒకప్పుడు అక్కడ నివసించే ప్రజల నమ్మే ఒక పెద్ద కోతి ఆకారంలో ఉన్న దేవుడి విగ్రహాం ఉందని నమ్మకం. డగ్లస్ ప్రెస్టన్ ఈ పుస్తకం రాయకముందు 2015లోనే ఈ విషయాల గురించి రాసిన ఒక కథనం ఇక్కడ చూడొచ్చు. ఐతే ఈ పుస్తకంలో చెప్పినదానికి పోస్టులో ఉన్న హనుమాన్ విగ్రహానికి ఎటువంటి సంబంధంలేదు. ఎందుకంటే ఈ విగ్రహాం పురావస్తు ప్రదేశాలు కనుగొనేందుకు చేసిన ప్రయత్నాల కన్నా చాలా ముందే డెన్వర్ మ్యూజియం వాళ్ళు కొనుగోలు చేసారు.

చివరగా, ఇది 19వ శతాబ్దంలో భారత దేశంలో తయారుచేయబడ్డ హనుమాన్ విగ్రహాం, అమెరికన్ దేవుడిది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll