Fake News, Telugu
 

మొరాకో దేశంలో వచ్చిన వరద వీడియో పెట్టి, ‘నిన్న కేదారనాధ్ దగ్గర’ అంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు

1

నిన్న కేదారనాధ్ దగ్గర తీసిన వీడియో అని చెప్తూ ఒక వరద వీడియోని కొందరు సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : కేదారనాధ్ లో వచ్చిన వరద వీడియో.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని వీడియోకి, కేదారనాధ్ కి ఎటువంటి సంబంధం లేదు. ఆ వీడియో మొరాకో లోని ఇమ్లిల్ గ్రామం లో వచ్చిన వరదలకు సంబంధించినది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు

పోస్ట్ లో పెట్టిన వీడియో సరిగ్గా వింటే, వీడియో లో ఎక్కడా కూడా హిందీ బాషలో మాట్లాడరు. ఏదో వేరే బాషలో మాట్లాడుతుంటారు. అంతే కాదు, వీడియో లో 2 నిమిషాల 39 సెకండ్ల దగ్గర బిల్డింగ్ మీద అరబిక్ బాషలో ఏదో రాసి ఉన్నట్టు చూడవచ్చు. కేదారనాధ్ లాంటి పుణ్యక్షేత్రం దగ్గరలో అలా రాసి ఉండే అవకాశం చాలా తక్కువ. కావున, వీడియో ఎక్కడిదో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ లో వెతకగా, ఇదే వీడియోతో ఉన్న కొన్ని ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. ఆ ఆర్టికల్స్ లో వీడియోలోని వరద మొరాకో దేశంలోని ఇమ్లిల్ గ్రామంలో వచ్చిందని రాసినట్టు చదవచ్చు. ఈ ఘటనకి సంబంధించిన మరో వీడియోని కొందరు ‘#imlil’ హాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో పోస్ట్ చేసినట్టు చూడవచ్చు. అంతేకాదు, ఇంకో ట్వీట్ లో వీడియోలో చూపెట్టిన ప్రదేశాన్ని వరద తర్వాత రిపేర్ చేస్తున్నట్టు కూడా చూడవచ్చు.

గూగుల్ లో ‘ imlil’ అని వెతికితే వీడియోలో ఉన్న బ్రిడ్జి ని పోలి ఉన్న ఫోటో కూడా వస్తుంది.

కావున, మొరాకో దేశంలో వచ్చిన వరద వీడియో పెట్టి, ‘నిన్న కేదారనాధ్ దగ్గర’ అంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll