ఒక కూడలి వద్ద ‘గద, విల్లు మరియు బాణం’ ఉన్న ఫోటో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, దానిని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ అయోధ్య లోని ఒక ట్రాఫిక్ కూడలి దగ్గర ఏర్పాటు చేయించారని సోషల్ మీడియా లో చెప్తున్నారు. పోస్ట్ లో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అయోధ్య లోని ఒక ట్రాఫిక్ కూడలి వద్ద ‘గద, విల్లు మరియు బాణం’ ఉన్న ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఫొటోలోని ‘గద, విల్లు మరియు బాణం’ ఉన్న కూడలి వడోదర (గుజరాత్) లో ఉంది, అయోధ్య (ఉత్తర్ ప్రదేశ్) లో కాదు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికినప్పుడు, అదే ఫొటోతో, క్లెయిమ్ తో ఉన్న ఒక ట్వీట్ సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చింది. ఆ ట్వీట్ కింద ఉన్న కామెంట్స్ లో ఒకతను ఆ కూడలి వడోదర (గుజరాత్) లోని ‘గద సర్కిల్’ అని తెలిపారు. ఆ సమాచారంతో గూగుల్ లో వెతికినప్పుడు, ఆ శిల్పం వడోదర (గుజరాత్) లోని ‘గద సర్కిల్’ వద్దనే ఉందని తెలిసింది. ‘గద సర్కిల్’ ప్రాంతం యొక్క గూగుల్ స్ట్రీట్ వ్యూ ని ఇక్కడ చూడవచ్చు.
చివరగా, ఫొటోలోని ‘గద, విల్లు మరియు బాణం’ ఉన్న కూడలి వడోదర (గుజరాత్) లో ఉంది, అయోధ్య (ఉత్తర్ ప్రదేశ్) లో కాదు.