Fake News, Telugu
 

విజయ్ మాల్యా 2016లో బీజేపీకి రూ. 35 కోట్లను విరాళంగా ఇచ్చినట్టుగా షేర్ చేస్తున్న ఈ చెక్ నిజమైనది కాదు

0

బ్యాంకుల నుండి రూ. వేల కోట్ల రుణాలు తీసుకొని విదేశాలకు పరారైన విజయ్ మాల్యా, 2016లో బీజేపీకి రూ. 35 కోట్లను విరాళంగా ఇచ్చారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో యాక్సిస్ బ్యాంక్ చెక్ ఫోటో ఒకటి బాగా షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: విజయ్ మాల్యా 2016లో బీజేపీకి రూ. 35 కోట్లను విరాళంగా ఇస్తూ అందజేసిన బ్యాంక్ చెక్ ఫోటో.

ఫాక్ట్ (నిజం): రాజకీయ పార్టీల విరాళాలకి సంబంధించి ఎన్నికల కమిషన్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం బీజేపీ 2016-17 వార్షిక సంవత్సరంలో మొత్తంగా అయిదు వందల ఇరవై ఎనిమీద కోట్ల రూపాయలు (5,28,79,33,206) విరాళంగా పొందింది. కానీ, ఈ విరాళాలు అందించిన వారి జాబితాలో విజయ్ మాల్యా పేరు గానీ, మాల్యాకు సంబంధించిన కంపనీల పేర్లు గానీ ఎక్కడా తెలుపలేదు. పోస్టులో షేర్ చేసిన చెక్‌లోని సంతకం కూడా విజయ్ మాల్యాది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో తెలుపుతున్నట్టు విజయ్ మాల్యా 2016లో బీజేపీకి 35 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారా? అని ఇంటర్నెట్లో వెతికితే, విజయ్ మాల్యా 2016లో బీజేపీకి రూ. 35 కోట్లను విరాళంగా ఇచ్చినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదని తెలిసింది.

పోస్టులో షేర్ చేసిన చెక్‌ను భారతీయ జనతా పార్టీ పేరుపై 2016 నవంబర్ నెలలో ఇచ్చినట్టు ఉంది. కానీ, రాజకీయ పార్టీల విరాళాలకి సంబంధించి ఎన్నికల కమిషన్‌లో అందుబాటులో ఉన్న వివరాలలో 2016-17 వార్షిక సంవత్సరంలో విజయ్ మాల్యా బీజేపీకి రూ. 35 కోట్లను విరాళంగా ఇచ్చినట్టు ఎక్కడా తెలుపలేదు. బీజేపీ 2016-17 వార్షిక సంవత్సరంలో మొత్తంగా అయిదు వందల ఇరవై ఎనిమీద కోట్ల రూపాయలు (5,28,79,33,206) విరాళంగా పొందినట్టు ఎన్నికల కమిషన్‌కు అందించిన వివరాలలో తెలిపింది. కానీ, ఈ విరాళాలు అందించిన వారి జాబితాలో విజయ్ మాల్యా పేరు గానీ, మాల్యాకు సంబంధించిన కంపనీల పేర్లు గానీ ఎక్కడ తెలుపలేదు.

పోస్టులో షేర్ చేసిన చెక్‌పై భారతీయ జనతా పార్టీ స్పెల్లింగ్ తప్పుగా రాసి ఉంది (‘Bharatiya Janata Party’ని ‘Bhartiya Janta Party’ అని తప్పుగా రాశారు). అంతేకాదు, పోస్టులో షేర్ చేసిన చెక్‌పై చేసిన సంతకం విజయ్ మాల్యాది కాదు. విజయ్ మాల్యా బీజేపీకి రూ. 35 కోట్లను విరాళంగా ఇచ్చిన చెక్ అంటూ షేర్ చేసిన ఈ ఫోటో ఫేక్ అని పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి.

చివరగా, విజయ్ మాల్యా 2016లో బీజేపీకి రూ. 35 కోట్లను విరాళంగా ఇచ్చినట్టుగా షేర్ చేస్తున్న ఈ చెక్ నిజమైనది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll