Fake News, Telugu
 

2008 లో అక్రమ కట్టడాలను కూల్చే పనిలో భాగంగా గుళ్లను కూల్చివేశారు, అంబానీ మరియు అదానీలకు భూమి ఇవ్వడానికి కాదు

1

అంబానీ మరియు అదానీ లకు భూమి ఇవ్వడానికి గుజరాత్ లో యాబై గుళ్లను బీజేపీ ప్రభుత్వం కూల్చింది అంటూ ఒక వీడియోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : అంబానీ మరియు అదానీ లకు భూమి ఇవ్వడానికి గుజరాత్ లో యాబై గుళ్లను కూల్చిన బీజీపీ ప్రభుత్వం.

ఫాక్ట్ (నిజం): 2008 లో అక్రమ కట్టడాలను కూల్చే పనిలో భాగంగా గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం గుళ్లను కూల్చివేసింది. అంతేకానీ, అంబానీ మరియు ఆదానీ కి భూమి ఇవ్వడానికి కాదు. గుళ్లను కూల్చడాన్ని హిందూ ధార్మిక సంస్థలు వ్యతిరేకించడంతో ఆ పనిని బీజీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.    

వీడియో లో ‘Modi Demolition Drive’ అని రాసి ఉన్నట్టు చూడవచ్చు. కావున, గూగుల్ లో ఆ పదాలతో వెతకగా, 2008 లో NDTV ప్రసారం చేసిన అదే వీడియో సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది.

పోస్ట్ లోని వీడియో కంటే యూట్యూబ్ లో NDTV అప్లోడ్ చేసిన వీడియో పొడవు ఎక్కువ. యూట్యూబ్ వీడియోలో మొదట్లో యాంకర్ మాట్లాడుతూ అక్రమ కట్టడాలను కూల్చే ప్రోగ్రాంలో భాగంగా గుజరాత్ లో మోడీ ప్రభుత్వం గుళ్లను కూల్చినట్టు చెప్తుంది. అదే విషయం ఆ వీడియో కింద వివరణ లో కూడా చూడవచ్చు. కావున, ఆ గుళ్లను కూల్చింది అంబానీ మరియు ఆదానీ కి భూమి ఇవ్వడానికి కాదు.

అంతేకాదు, గుళ్లను కూల్చాడాన్ని హిందూ ధార్మిక సంస్థలు వ్యతిరేకించడంతో ఆ ప్రోగ్రాం ని వెంటనే బీజీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసినట్టు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ లో మరియు NDTV తర్వాతి రోజు అప్లోడ్ చేసిన ఇంకో వీడియోలో చూడవచ్చు.

చివరగా, 2008 లో అక్రమ కట్టడాలను కూల్చే పనిలో భాగంగా గుళ్లను కూల్చారు, అంబానీ మరియు అదానీలకు భూమి ఇవ్వడానికి కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll