భారతదేశంలో సమయం అవ్వకముందే ఆ సమయంతో చంద్రబాబు, లోకేష్ మరియు పవన్ ట్వీట్లు చేసారని చెప్తూ వాళ్ళ ట్వీట్ల యొక్క స్క్రీన్ షాట్స్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. సమయం కంటే ముందే ట్వీట్ చేసారు కాబట్టి వాళ్ళ అకౌంట్స్ ని ఎవరో తూర్పు ఆసియా దేశంలో ఉంటూ నడిస్తున్నారని పోస్టుల్లో పేర్కొంటున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: భారత్ లో సమయం అవ్వకముందే చంద్రబాబు, లోకేష్ మరియు పవన్ ట్వీట్లు. ముగ్గురి తరఫున విదేశాల నుంచి ఓ సంస్థ ఈ ఖాతాలను నిర్వహిస్తోంది.
ఫాక్ట్ (నిజం): భారత్ లో సమయం అవ్వకముందే చంద్రబాబు, లోకేష్ మరియు పవన్ ట్వీట్లు చేయలేదు. వారు భారతదేశంలో చేసిన ట్వీట్ల యొక్క టైం స్టాంప్ ఆస్ట్రేలియాలో ఉన్న వారికి ఎలా కనిపిస్తాయో స్క్రీన్ షాట్స్ తీసి, ఎవరో వారి తరపున తూర్పు ఆసియా నుండి ట్వీట్ చేసినట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లో చెప్పిన విషయాలను సాక్షీ దినపత్రిక కూడా ప్రచురించింది. ఆ ఆర్టికల్ ని ఇక్కడ (ఆర్కైవ్డ్ వెర్షన్) చదవొచ్చు.
ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ట్వీట్ యొక్క టైం స్టాంప్ అన్ని దేశాల్లో ఒకేలా కనపడదు. ఉదాహరణకి FACTLY ఇండియాలో 28 నవంబర్, 2019 న మధ్యాహ్నం 12:40 PM కి ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ కింద టైం స్టాంప్ ఇండియా లో చుస్తే ‘12:40 PM · Nov 28, 2019’ అని కనిపిస్తుంది. కానీ, ఆస్ట్రేలియా లో ‘6:10 PM · Nov 28, 2019’ అని, యూరోప్ లో ‘7:10 AM · Nov 28, 2019’ అని మరియు అమెరికా లో ‘11:10 PM · Nov 27, 2019’ అని కనిపిస్తుంది. ఇదే విషయాన్నీ ఆయా దేశాల్లో ఉండే వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసి మాకు పంపారు. వివిధ దేశాల్లో ఆ ట్వీట్ యొక్క టైం స్టాంప్ ఎలా కనిపిస్తుందో కింద ఫోటోలో చూడవొచ్చు. అమెరికాలో అయితే భారత్ లో ఈరోజు (Nov 28, 2019) చేసిన ట్వీట్ నిన్న (Nov 27, 2019) చేసినట్టు కనిపిస్తున్నట్టు చూడవొచ్చు.
ఒకరు చేసిన ట్వీట్ వేరే వారు ఎక్కడ చూస్తున్నారో దాని బట్టి టైం స్టాంప్ కనబడుతుంది. అంటే వాళ్ళు ఉన్న టైం జోన్ బట్టి ఆ టైం స్టాంప్ కనబడుతుంది. కావున, అలానే భారత్ లో చంద్రబాబు, లోకేష్ మరియు పవన్ చేసిన ట్వీట్లను ఎవరైనా వేరే టైం జోన్లో ఉన్న దేశంలో చూస్తే వాళ్ళకు వేరే సమయం కనిపిస్తుంది. అలా చూసి తీసిన స్క్రీన్ షాట్స్ ని భారత్ లో సమయం కాక ముందే ట్వీట్ చేసినట్టు షేర్ చేస్తున్నారు. సాక్షీ పత్రికలో చెప్పినట్టు తమ తప్పు తెలుసుకొని చంద్రబాబు, లోకేష్ మరియు పవన్ తమ ట్వీట్లను సవరించుకోలేదు. వాళ్ళ ట్వీట్లను ఇప్పటికీ సిడ్నీ (ఆస్ట్రేలియా) లో ఎవరైనా చూస్తే వాళ్ళకు వీరు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ట్వీట్ చేసినట్టు చూడవొచ్చు.
చివరగా, చంద్రబాబు, లోకేష్ మరియు పవన్ యొక్క ట్వీట్లు విదేశాల నుండి రావట్లేదు. అది ఒక ఫేక్ న్యూస్.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: చంద్రబాబు, లోకేష్ మరియు పవన్ కళ్యాణ్ ట్వీట్లు విదేశాల నుండి రావట్లేదు. అది ఒక ఫేక్ న్యూస్ - Fact Checking