Fake News, Telugu
 

2018 ఘటనకు సంబంధించిన ఈ వీడియోలో కపిల్ మిశ్రాతో ఘర్షణకు దిగింది AAP కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కాదు

0

ఢిల్లీ బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రాను తన సొంత పార్టీ నాయకులే వేదిక పై నుంచి నెట్టేస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఢిల్లీ బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రాను తన సొంత పార్టీ నాయకులే వేదిక పై నుంచి నెట్టేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో, 2018లో కపిల్ మిశ్రా బీజేపీలో చేరకముందు జరిగిన ఒక ఘర్షణ దృశ్యాలని చూపిస్తుంది. తూర్పు ఢిల్లీలో జరిగిన ఒక కమ్యూనిటీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో, లోకల్ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మునిసిపల్ కౌన్సిలర్ బంధువుకు, అప్పటికే AAP రెబెల్‌గా మారిన కపిల్ మిశ్రాకు ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో భాగంగానే AAP కౌన్సిలర్ బంధువు, కపిల్ మిశ్రాను వేదిక పై నుంచి నేట్టేసారు. ఈ వీడియోలో కపిల్ మిశ్రాను తోసివేసింది బీజేపీ కార్యకర్తలు కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Rajmangal Times’ న్యూస్ సంస్థ 29 నవంబర్ 2018 నాడు తమ ఫేస్బుక్ పేజీలో షేర్ చేసినట్టు తెలిసింది. తూర్పు ఢిల్లీలోని ఖజురి ప్రాంతంలో జరిగిన ఒక సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాజీ మంత్రి కపిల్ మిశ్రాకు AAP కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ యొక్క దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు.

ఈ ఘర్షణకు సంబంధించిన మరొక వీడియోని ‘Dilli Tak’ న్యూస్ ఛానల్ 29 నవంబర్ 2018 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసింది. తూర్పు ఢిల్లీ ప్రాంతంలోని శ్రీరామ్ కాలనీలో జరిగిన ఒక కమ్యూనిటీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లోకల్ AAP మునిసిపల్ కౌన్సిలర్ బంధువు అయిన హాజీ బళ్ళుకు, కపిల్ మిశ్రాకు మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్టు ఈ వీడియో వివరణలో తెలిపారు. ఈ ఘర్షణలలో భాగంగానే హాజీ బళ్ళు మద్దతుదారులు కపిల్ మిశ్రాను వేదిక పై నుండి తోసివేయడానికి ప్రయత్నించినట్టు ఈ వీడియోలో రిపోర్ట్ చేసారు.  ఈ ఘర్షణకు సంబంధించి కపిల్ మిశ్రా పెట్టిన ఫేస్బుక్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు.

ఈ ఘర్షణకు సంబంధించిన వివరాలను రిపోర్ట్ చేస్తూ నవంబర్ 2018లో పబ్లిష్ అయిన న్యూస్ అర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ ఘర్షణ చోటుచేసుకుంది 2018లో. కానీ, కపిల్ మిశ్రా బీజేపీలో చేరింది 2019 ఆగష్టు నెలలో. దీన్ని బట్టి, వీడియోలో కనిపిస్తున్న ఘటన కపిల్ మిశ్రా బీజేపీలో చేరక ముందు జరిగినదని, ఈ వీడియోలో కపిల్ మిశ్రాను తోసివేసింది బీజేపీ కార్యకర్తలు కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, 2018లో కపిల్ మిశ్రాకు AAP కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ వీడియోని బీజేపీ కార్యకర్తలు కపిల్ మిశ్రాను వేదిక పై నుండి తోసివేస్తున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll