Fake News, Telugu
 

గ్రేస్ పీరియడ్ అయిపోయిన తరవాత LIC పాలసీ రెన్యువల్ చేసుకుంటే ఆక్సిడెంట్ కవరేజ్ వర్తించదన్న నిబంధనేది లేదు

0

LIC పాలసీకు సంబంధించి గ్రేస్ పీరియడ్ అయిపోయిన తరవాత ప్రీమియం కట్టి పాలసీ రెన్యువల్ చేసుకున్నా కూడా ఆ సంవత్సరం ఆక్సిడెంట్ కవరేజ్ వర్తించదని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: LIC పాలసీకు సంబంధించి గ్రేస్ పీరియడ్ అయిపోయిన తరవాత ప్రీమియం కట్టి పాలసీ రెన్యువల్ చేసుకున్నా కూడా ఆ సంవత్సరం ఆక్సిడెంట్ కవరేజ్ వర్తించదు.

ఫాక్ట్(నిజం): పాలసీ నియమాల ప్రకారం ల్యాప్స్ అయిన పాలసీను మొదటిసారి ప్రీమియం చెల్లించని తేది నుండి వరుసగా ఐదు సంవత్సరాలలోపు మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుంది. ముందుగా ల్యాప్స్ అయిన పాలసీను పునరుద్ధరించాక, ఆక్సిడెంట్ కవరేజ్ కూడా పునరుద్ధరించుకోవాలి. కాకపోతే LIC నియమాల ప్రకారం పాలసీ పునరుద్ధరణను ఆమోదించే/ తిరస్కరించే/ ముందు ఉన్న పాలసీ నియమాలలో మార్పులు చేసి ఆమోదించే విశేషాధికారం LICకు ఉంటుంది. ఐతే పాలసీ రెన్యువల్ చేసుకున్నా కూడా ఆ సంవత్సరం ఆక్సిడెంట్ కవరేజ్ వర్తించదన్న నిబంధన మాత్రం ఎక్కడా లేదు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

సాధారణంగా LIC ఇన్సురన్స్ పాలసీకు సంబంధించి ప్రీమియం చెల్లించడానికి గడువు తేది దాటినాక కూడా గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ గ్రేస్ పీరియడ్ లోపు ప్రీమియం చెల్లించకపోతే పాలసీ ల్యాప్స్ అవుతుంది. LIC పాలసీ నియమాల ప్రకారం ఇలా ల్యాప్స్ అయిన పాలసీను మొదటిసారి ప్రీమియం చెల్లించని తేది నుండి వరుసగా ఐదు సంవత్సరాలలోపు మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుంది.

అప్పటివరకు చెల్లించని ప్రీమియంలు, LIC నిర్దేశించిన వడ్డీ మరియు ఇతర ఛార్జీలు చెల్లించి ల్యాప్స్ అయిన పాలసీను తిరిగి పునరుద్ధరించుకోవచ్చు. ఐతే LIC నియమాల ప్రకారం పాలసీ పునరుద్ధరణను ఆమోదించే/ తిరస్కరించే/ ముందు ఉన్న పాలసీ నియమాలలో మార్పులు చేసి ఆమోదించే విశేషాధికారం LICకు ఉంటుంది.

ఇకపోతే ఆక్సిడెంట్ కవరేజ్ అనేది ఒక బేస్ పాలసీకు అదనంగా మనం తీసుకునే ఆప్షన్ (రైడర్) కాబట్టి, ల్యాప్స్ అయిన పాలసీను పునరుద్ధరించాకే, ఆక్సిడెంట్ కవరేజ్ కూడా పునరుద్ధరించుకోవాలి. కాకపోతే పైన చెప్పినట్టు దీనిని ఆమోదించే విశేషాధికారం LICకు ఉంటుంది. ఐతే LIC నియమాలలో ఎక్కడ కూడా గ్రేస్ పీరియడ్ అయిపోయిన తరవాత ప్రీమియం కట్టి పాలసీ రెన్యువల్ చేసుకున్నా కూడా ఆ సంవత్సరం ఆక్సిడెంట్ కవరేజ్ వర్తించదన్న నిబంధన లేదు.

ఒకవేళ LIC తమ అధికారాలకు ఉపయోగించి ఆక్సిడెంట్ కవరేజ్ రద్దు చేసినా, కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఇలా చేస్తుందే తప్ప అందరికీ ఇలా రద్దు చేయదు. కాబట్టి ప్రస్తుతం షేర్ అవుతున్న పోస్టులో చేస్తున్నది కచ్చితమైన వాదన అని చెప్పలేము.

చివరగా, గ్రేస్ పీరియడ్ అయిపోయిన తరవాత LIC పాలసీ రెన్యువల్ చేసుకుంటే ఆక్సిడెంట్ కవరేజ్ వర్తించదన్న నిబంధనేది లేదు.

Share.

About Author

Comments are closed.

scroll