Fake News, Telugu
 

చంద్రుడి ఉపరితలం నుంచి తిరిగి భూమిపైకి రావటానికి అక్కడ అంతరిక్ష కేంద్రం ఉండవలసిన అవసరం లేదు

0

చంద్రుడిపైన అంతరిక్ష కేంద్రం లేనందున మనుషులు వెళ్లి తిరిగి రావడం అసాధ్యమని, ఇప్పటివరకు ఎవరూ చంద్రుడిపై అడుగు పెట్టలేదని, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపైన అడుగు పెట్టాడు అన్నది అమెరికా ప్రపంచానికి చెప్పిన అబద్దం అంటూ ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలలో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: చంద్రుడిపై నుండి తిరిగి వెనక్కి రావటానికి సౌకర్యం లేదు, కావున  నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపైన అడుగు పెట్టిన మొదటి వ్యక్తి అన్నది అమెరికా ఆడిన అబద్దం. 

ఫాక్ట్: చంద్రుడి ఉపరితలం నుంచి తిరిగి రావటానికి అక్కడ అంతరిక్ష కేంద్రం ఉండవలసిన అవసరం లేదు. ఆస్ట్రోనాట్స్ చంద్రుని ఉపరితలంపై తమ అన్వేషణలను పూర్తి చేసిన తర్వాత, వారు తిరిగి వెళ్లే లూనార్ మోడ్యూల్, అసెంట్ స్టేజిలోకి వెళ్తుంది. ఇది చంద్రుని ఉపరితలం నుండి పైకి లేవడానికి, ఆస్ట్రోనాట్స్ కమాండ్ మోడ్యూల్ వద్దకు చేరుకునే ప్రక్రియను పూర్తి చేస్తుంది. కమాండ్ మాడ్యూల్ ప్యారాచూట్లను ఉపయోగించి ఆస్ట్రోనాట్స్ పసిఫిక్ సముద్రంలో దిగగా, ఓడ సిబ్బంది వచ్చి వారిని తీసుకువెళ్లింది. కావున ఈ వీడియోలో చేసిన క్లెయిమ్ తప్పు.

ముందుగా, నాసా చేపట్టిన మూన్ మిషన్ల గురించి ఇంటర్నెట్లో వెతకగా, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, మైఖేల్ కాలిన్స్ మరియు బజ్ ఆల్డ్రిన్ సిబ్బంది చంద్రున్ని చేరుకున్నారు అని తెలిసింది. దీని ద్వారా ఆస్ట్రోనాట్స్ చంద్రుని మీదకు వెళ్లి తిరిగి వచ్చే ప్రక్రియ గురించి వెతకగా, నాసా వెబ్సైటులో దీని గురించి ఇచ్చిన వివరణ లభించింది. ఆర్మ్‌స్టాంగ్, ఆల్డ్రిన్ చంద్రుని ఉపరితలంపై నడవగా, కాలిన్స్ చంద్రుని చుట్టూ కక్ష్యలో ఉన్నారు.

అపోలో స్పేస్‌క్రాఫ్ట్‌ సాటర్న్-V రాకెట్ పైన లాంచ్ చేయబడింది. సాటర్న్-V మూడు దశలతో రూపొందించబడింది. మొదటి రెండు దశలు చంద్రుడి వద్దకు చేరే సమయానికి కక్ష్యలో ఉండే  ఇంధనాన్ని ఉపయోగించాయి. మూడవ దశ అపోలో కమాండ్ మాడ్యూల్ , లూనార్ మాడ్యూల్‌ను చంద్రునిపైకి నెట్టడానికి ఉపయోగించబడింది. అంతరిక్ష నౌక చంద్రుడిని చేరుకున్న తర్వాత, రెండు మాడ్యూల్స్ ఒకదానికొకటి విడిపోగా, లూనార్ మాడ్యూల్‌లోని ఇద్దరు ఆస్ట్రోనాట్స్ చంద్రుని ఉపరితలంపై దిగారు. మూడవ ఆస్ట్రోనాట్ చంద్రుని కక్ష్యలోని కమాండ్ మాడ్యూల్‌లో ఉండిపోయాడు.

ఆస్ట్రోనాట్స్ లూనార్ రోవర్‌తో చంద్రునిపై ప్రయాణించారు. అవి మడతపెట్టడానికి వీలుగా తయారు చేయబడ్డాయి. ఈ రోవర్లను చంద్రుని ఉపరితలాన్ని అన్వేషించడానికి వాడారు.

ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ఉపరితలంపై పని చేయడం పూర్తయిన తర్వాత, వాటిని చంద్రుడి పైనే వదిలి పెట్టి వారు తిరిగి లూనార్ మాడ్యూల్‌లోకి వచ్చి దాన్ని లాంచ్ చేస్తే అది అసెంట్ స్టేజికి ప్రవేశిస్తుంది. ఇది చంద్రుని ఉపరితలం నుండి పైకి లేవడానికి, ఆస్ట్రోనాట్స్ కమాండ్ మోడ్యూల్ వద్దకు చేరుకునే ప్రక్రియను పూర్తి చేస్తుంది.

ఇద్దరు ఆస్ట్రోనాట్స్ తిరిగి కమాండ్ మాడ్యూల్‌లోకి వచ్చి, లూనార్ మాడ్యూల్‌ను వదిలి భూమికి తిరిగి వెళ్లారు. లూనార్ మాడ్యూల్ చంద్రునిపై కూలిపోయింది. కమాండ్ మాడ్యూల్ ప్యారాచూట్లను ఉపయోగించి ఆస్ట్రోనాట్స్ పసిఫిక్ సముద్రంలో దిగగా, ఓడ సిబ్బంది వచ్చి వారిని తీసుకువెళ్లింది (ఇక్కడ మరియు ఇక్కడ).

ఈ మొత్తం ప్రక్రియ వివరాలు తెలుపుతూ ‘Vox’ న్యూస్ సంస్థ చేసిన వీడియోని ఇక్కడ చూడవొచ్చు

చివరిగా, చంద్రుడి ఉపరితలం నుంచి తిరిగి భూమిపైకి రావటానికి అక్కడ అంతరిక్ష కేంద్రం ఉండవలసిన అవసరం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll