Fake News, Telugu
 

LPG సిలిండర్లకు expiry తేదీ ఉండదు, టెస్ట్ గడువు తేదీ మాత్రమే ఉంటుందని IOCL స్పష్టం చేసింది

1

LPG గ్యాస్ సిలిండర్లను expiry తేదీ తర్వాత ఉపయోగిస్తే ప్రమాదాలు జరుగుతాయి అని, సిలిండర్లపై  ఉన్న ఆల్ఫా-న్యూమెరిక్ కోడ్ ఎక్స్పైరీ తేదిని సూచిస్తుందని క్లెయిమ్ చేస్తూ ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ క్లెయిమ్ లో ఎంత వాస్తవం ఉందో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: LPG గ్యాస్ సిలిండర్ యొక్క expiry తేదీని సిలిండర్ పైన ప్రింట్ చేసిన కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు.

ఫాక్ట్ (నిజం): LPG గ్యాస్ సిలిండర్లకి expiry తేదీ ఉండదని, సిలిండర్ల పైన ప్రింట్ చేసిన కోడ్ సిలిండర్ల టెస్టు గడువును తెలియ చేస్తుందని IOCL తాను ఇచ్చిన స్టేట్మెంట్ లో స్పష్టం చేసింది. కావున, వీడియోలో చేసిన క్లెయిమ్ తప్పు దారి పట్టిస్తుంది.

LPG గ్యాస్ సిలిండర్ల expiry తేదీ గురించి గూగుల్ లో వెతకగా IOCL (ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్) వారు ఈ ఇష్యూ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ కనిపించింది. ఆ స్టేట్మెంట్ ప్రకారం LPG గ్యాస్ సిలిండర్లకు expiry తేదీ ఉండదు అని కేవలం టెస్టు గడువు మాత్రమే ఉంటుందని తెలుస్తుంది. అంతేకాక, సిలిండర్ల పై రాసి ఉన్న కోడ్ లను ఉదాహరణల ద్వారా వివరించింది. ‘A2017’ అని ఉంటే సిలిండర్ల టెస్ట్ గడువు మొదటి క్వార్టర్ లో (జనవరి – మార్చ్ మధ్య) ఉంటుందని, ‘B2017’ అని ఉంటె సిలిండర్ల టెస్ట్ గడువు రెండవ క్వార్టర్ లో (ఏప్రిల్ – జూన్ మధ్య) ఉంటుంది. అలాగే, C మూడవ క్వార్టర్ ని (జులై – సెప్టెంబర్), D నాల్గవ క్వార్టర్ ని (అక్టోబర్- డిసెంబర్) సూచిస్తుంది.

ఒక ఆయిల్ కంపెనీకి సంబందించిన వ్యక్తి ‘The Hindu‘ న్యూస్ పేపర్ తో మాట్లాడుతూ ఎవరైనా కస్టమర్ కి టెస్ట్ కి గడువు ఉన్న సిలిండర్ వస్తే వాళ్ళు ఆ సిలిండర్ ని డెలివరీ బాయ్ తో వెనక్కి పంపించి వేరే సిలిండర్ని తీసుకోవచ్చు, ఎందుకంటే ఆ సిలిండర్ కి జరగాల్సిన టెస్ట్ జరగలేదు. కానీ, ఇలాంటి పరిస్థితి చాలా అరుదు అని తెలిపాడు. IOCL తన స్టేట్మెంట్ లో LPG సిలిండర్లు టెస్ట్ తేదీ గడువు ముగియడం వలన కానీ, టెస్ట్ గడువు తేదికి దగ్గరగా ఉండడం వళ్ళ కానీ ఎలాంటి ప్రమాదాలు రిపోర్ట్ కాలేదు అని  పేర్కొంది. 

చివరగా, LPG గ్యాస్ సిలిండర్లకి ఎక్స్పైరీ తేదీ ఉండదు, టెస్ట్ గడువు మాత్రమే ఉంటుంది అని IOCL తన స్టేట్మెంట్ లో స్పష్టం చేసింది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll