“మోక్షం కావాలంటే యేసు దగ్గరకు రండి. మీరు ఊహించే సకల దేవుళ్ళకంటే మిక్కిలి ఉన్నత స్థితిలో ఉన్నవాడు యేసు” అని స్వామి వివేకానంద అన్నారని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: “మోక్షం కావాలంటే యేసు దగ్గరకు రండి. మీరు ఊహించే సకల దేవుళ్ళకంటే మిక్కిలి ఉన్నత స్థితిలో ఉన్నవాడు యేసు” – స్వామి వివేకానంద.
ఫాక్ట్: “మోక్షం కావాలంటే యేసు దగ్గరకు రండి. మీరు ఊహించే సకల దేవుళ్ళకంటే మిక్కిలి ఉన్నత స్థితిలో ఉన్నవాడు యేసు” అని స్వామి వివేకానంద అన్నట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. జ్ఞానదీపం అనే పుస్తకం స్వామి వివేకానంద రాసినట్టు కూడా మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఇటువంటి పోస్టులు కనీసం 2014 నుండి ఇంటర్నెట్‌లో షేర్ అవుతున్నాయి. ‘Complete Works of Swami Vivekananda’ పుస్తకంలో, స్వామి వివేకానంద, మోక్షం కావాలంటే యేసు దగ్గరకు రావాలని అనలేదు.
స్వామి వివేకానంద యేసు గురించి అలా అన్నట్టు ఆన్‌లైన్‌లో ఎక్కడా కూడా ఎటువంటి కచ్చితమైన సమాచారం లేదు.
తమిళ భాషలో జ్ఞానదీపం అనే పుస్తకం స్వామి వివేకానందకు సంబంధించి ఉన్నట్టు amazon వెబ్సైటులో చూడొచ్చు. ఈ పుస్తకంలో ఇలా ప్రచురించారని కొంతమంది ఇంటర్నెట్‌లో అంటున్నారు. జ్ఞానదీపం అనే పుస్తకం స్వామి వివేకానంద రాసినట్టు మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు.
చివరగా, “మోక్షం కావాలంటే యేసు దగ్గరకు రండి. మీరు ఊహించే సకల దేవుళ్ళకంటే మిక్కిలి ఉన్నత స్థితిలో ఉన్నవాడు యేసు” అని స్వామి వివేకానంద అన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు.