పాత రేడియో మరియు టీవీలలో ‘రెడ్ మెర్క్యురీ’ ఉంటుందని, అది చాలా ప్రమాదకరమైనదని, న్యూక్లియర్ ఆయుధాల్లో వాడే అవకాశం ఉందని చెప్తూ ఒక మెసేజ్ ని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్ (దావా): న్యూక్లియర్ ఆయుధాల్లో వాడే ‘రెడ్ మెర్క్యురీ’ పాత టీవీల్లో ఉంటుంది.
ఫాక్ట్ (నిజం): ‘రెడ్ మెర్క్యురీ’ అనేదే అసలు ఏమీ లేదు. ఇదే విషయాన్ని అమెరికా అధికారి ఒకరు కూడా 2002 లోనే తెలిపారు. ‘రెడ్ మెర్క్యురీ’ తో న్యూక్లియర్ ఆయుధాలు తయారుచేయవొచ్చు అనేది ఒక గాలివార్త. ఆ పేరుతో న్యూక్లియర్ ఆయుధాలు తాయారు చేసే కెమికల్ ఏదో ఉందని వివిధ టెర్రరిస్ట్ సంస్థలు దాని గురించి వెతికారు, కానీ అలాంటి కెమికల్ ఒకటి ఉందని ఎక్కడా కూడా ఆధారాలు లేవు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
‘రెడ్ మెర్క్యురీ’ గురించి ఇంటర్నెట్ లో వెతకగా, యూఎస్ డిపార్ట్మెంట్ అఫ్ స్టేట్ వారి వెబ్ సైట్ లింక్ ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ వెబ్సైటులో అమెరికన్ అధికారి ఒకరు 2002 లో లండన్ లో ఇచ్చిన స్పీచ్ ఉంటుంది. ‘రెడ్ మెర్క్యురీ’ అనేది ఒక గాలివార్త అని, ఆ పేరుతో న్యూక్లియర్ ఆయుధాలు తాయారు చేసే కెమికల్ ఏదో ఉందని వివిధ టెర్రరిస్ట్ సంస్థలు దాని గురించి వెతికి మోసపోయారు అని తన స్పీచ్ లో అమెరికన్ అధికారి తెలిపినట్టు చూడవొచ్చు.
అదే విషయాన్ని చెప్తూ ‘బీబీసీ’ మరియు ‘న్యూయార్క్ టైమ్స్’ వారు ప్రచురించిన ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు. ‘రెడ్ మెర్క్యురీ’ అనే కెమికల్ ఏమీ లేదని, రెడ్ కలర్ లో ఉండే మెర్క్యురీ ఖనిజం మాత్రం ఉందని, కానీ అది పోస్ట్ లో చెప్పినట్టు పేలుడు పదార్థం కాదని బీబీసీ వారి ఆర్టికల్ లో చదవొచ్చు.
పాత టీవీల్లో మరియు ఇతర కంప్యూటర్ వస్తువుల్లో లో కొంత మెర్క్యురీ మరియు ఇతర హానికర కెమికల్స్ ఉంటాయనే మాట వాస్తవమే, కానీ వాటిల్లో ‘రెడ్ మెర్క్యురీ’ ఉండదు. అసలు లేని ‘రెడ్ మెర్క్యురీ’ ని అమ్ముతామని చెప్తూ వివిధ సందర్భాల్లో కొందరు మోసం చేయడానికి ప్రయత్నించినప్పుడు పోలీసులు వారిని అరెస్ట్ చేసినట్టు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. పాత కుట్టు మెషిన్లలో కూడా ‘రెడ్ మెర్క్యురీ’ ఉందని 2009 లో సౌదీలో ప్రచారమైనట్టు ఇక్కడ చదవొచ్చు.
చివరగా, అసలు ‘రెడ్ మెర్క్యురీ’ అనేది ఒకటి ఉందని ఎక్కడా కూడా సమాచారం లేదు.