Fact Check, Fake News, Telugu
 

క్రైస్తవ మతానికి మారిన హిందువులు తమ పేరు నుండి శాస్త్రి, రెడ్డి మొదలైనవి తొలగించాలని కోర్టు తీర్పు చెప్పలేదు.

0

హిందూ మతం నుండి వేరే మతంలోకి మారినవారు తమ పేరులో ఉన్న రెడ్డి, నాడార్ వంటివి తీసేయాలి అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరి వాదనకి మద్దతుగా కొన్ని కోర్ట్ తీర్పులు గురించి పోస్టులో ప్రస్తావించారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హిందూ మతం నుండి వేరే మతంలోకి మారినవారు తమ పేరులో ఉన్న రెడ్డి, నాడార్ వంటివి తీసేయాలని కోర్టు తీర్పు చెప్పింది.

ఫాక్ట్(నిజం): క్రైస్తవ మతానికి మారిన హిందూ మతానికి చెందిన వారు తమ పేరు నుండి శాస్త్రి, రెడ్డి మొదలైనవి తొలగించాలని కోర్టు తీర్పు చెప్పలేదు. ఇతర మతాలకి మారిన వారు తము ముందు ఆచరించిన మతానికి సంబంధించిన సామాజిక హోదా కోల్పోతారని మద్రాస్ హై కోర్టు 2013లో చెప్పిన తీర్పును తప్పుగా అర్ధంచేసుకొని ఇలా ప్రచారం చేస్తున్నారు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో ఉన్న వార్తా కథనంలోని తేదిని బట్టి మద్రాస్ హై కోర్ట్ వెబ్సైటులో వెతకగా పోస్టులో ఉన్న ఫోటోకి సంబంధించిన తీర్పు కాపీ మాకు దొరికింది. ఐతే ఈ తీర్పులో క్రిస్టియన్ నాడార్ సామాజిక వర్గానికి చెందిన ఒక మహిళా ఒక ముస్లిం అబ్బాయిని వివాహం చేసుకున్న తరవాత ఆ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం పొందే ప్రక్రియలో క్రిస్టియన్ నాడార్ సామాజిక వర్గానికి సంబంధించిన రిజర్వేషన్ వర్తించదని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ద్వారా ఒక మతంలోని వెనకబడిన సామాజిక వర్గానికి చెందినవారు ఇతర మతానికి మారినప్పుడు ఆ  వెనకబడిన సామాజిక వర్గ హోదా కోల్పోతారని కోర్టు స్పష్టం చేసింది.

ఐతే ఈ తీర్పులో ఎక్కడ కూడా క్రైస్తవ మతానికి మారిన హిందూ మతానికి చెందిన వారు తమ పేరు నుండి శాస్త్రి, రెడ్డి మొదలైనవి తొలగించాలని ఎక్కడ కూడా చెప్పలేదు. దీన్నిబట్టి ఇతర మతాలకి మారిన వారు తము ముందు ఆచరించిన మతానికి సంబంధించిన సామాజిక హోదా కోల్పోతారని కోర్టు చెప్పిన తీర్పును తప్పుగా ప్రచారం చేస్తున్నారని చెప్పొచ్చు.

2020 లో కేరళ హై కోర్ట్ వివిధ తీర్పుల్లో కూడా క్రైస్తవ మతానికి మారిన హిందూ మతానికి చెందిన వారు తమ పేరు నుండి శాస్త్రి, రెడ్డి మొదలైనవి తొలగించాలని ఎక్కడ కూడా చెప్పలేదు.

చివరగా, క్రైస్తవ మారిన హిందూ మతానికి చెందిన వారు తమ పేరు నుండి శాస్త్రి, రెడ్డి మొదలైనవి తొలగించాలని కోర్టు తీర్పు చెప్పలేదు.

Share.

About Author

Comments are closed.

scroll