‘ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన’ అనే కొత్త పథకం ద్వారా అన్ని రాష్ట్రాల్లోని 5 నుండి 18 ఏళ్ళ ఆడపిల్లలకు ప్రతి నెల రెండు వేల రూపాయలు ఖాతాలో వేస్తారని, తొందరగా అప్లై చేసుకోమని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. అయితే, ఆ పేరుతో ఎటువంటి ప్రభుత్వ పథకం లేదని FACTLY విశ్లేషణలో తేలింది. ఆ పథకం గురించి ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. అంతేకాదు, ‘ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన’ పేరు మీద వివిధ పోస్టులు వైరల్ అవ్వడంతో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) వారు కూడా అవి ఫేక్ మెసేజ్లు అని, ఆ పేరుతో ఎటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం లేదని ట్వీట్ చేసారు.
సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ –
1. PIB ట్వీట్ – https://twitter.com/PIBFactCheck/status/1226847738110693377
Did you watch our new video?