Fake News, Telugu
 

కరోనా సమయంలో హిందీ సినిమా నటుడు షారుఖ్ ఖాన్ పాకిస్థాన్‌కు ₹45 కోట్ల సహాయం చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవు

0

కరోనా సమయంలో హిందీ సినీ నటుడు షారుఖ్ ఖాన్ పాకిస్థాన్‌కు ₹ 45 కోట్ల సహాయం చేశారంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కరోనా సమయంలో హిందీ సినీ నటుడు షారుఖ్ ఖాన్ పాకిస్థాన్‌కు ₹45 కోట్ల సహాయం చేశాడు.

ఫాక్ట్(నిజం): కరోనా సమయంలో హిందీ సినిమా నటుడు షారుఖ్ ఖాన్ పాకిస్థాన్‌కు ₹45 కోట్ల సహాయం చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. గతంలో కూడా ఇలానే షారుఖ్ ఖాన్ పాకిస్థాన్‌కు  ₹45 కోట్ల సహాయం చేశారంటూ పోస్టులు వైరల్ కాగా, అవి ఫేక్ అని వాటిని ఫాక్ట్-చెక్ చేస్తూ పలు మీడియా సంస్థలు కథనాలు పబ్లిష్ చేశాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ పోస్టులో తెలిపినట్టుగా, కరోనా సమయంలో హిందీ సినీ నటుడు షారుఖ్ ఖాన్ పాకిస్థాన్‌కు ₹ 45 కోట్ల సహాయం చేశారా? అని తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, ఆయన పాకిస్థాన్‌కు  ₹45 కోట్ల సహాయం చేసినట్లు ఎటువంటి ఆధారాలు మాకు లభించలేదు. పైగా, 2020లో కూడా ఇలాంటి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు తెలిసింది. అప్పుడు ఈ వార్త ఫేక్ అని తెలుపుతూ ‘హిందూస్తాన్ టైమ్స్’ పబ్లిష్ చేసిన వార్త కథనం ఒకటి మాకు లభించింది.

ఈ కథనం ప్రకారం, 2020 కరోనా సమయంలో షారుఖ్ ఖాన్ పాకిస్థాన్‌కు ₹ 45 కోట్ల సహాయం చేశారంటూ ‘ఇండియా టీవీ’ న్యూస్ క్లిప్పింగ్ ఒకటి వైరల్ అయింది. అయితే, అది ఒక క్లిప్ చేసిన వీడియో అని. 2017లో కూడా ఇలానే షారుఖ్ ఖాన్  పాకిస్థాన్‌లో ఆయిల్ ట్యాంకర్ పేలి 219 మంది మరణించగా, ప్రమాద బాధితుల సహాయార్థం పాకిస్థాన్‌కు ₹ 45 కోట్లు అందజేశారంటూ ప్రచారం జరగగా, ఆ ప్రచారంలో నిజం లేదని చెప్తు ఇండియా టీవీ వార్త కథనం ప్రచురించింది. ఆ ఫాక్ట్- చెక్ వీడియో రిపోర్టును క్లిప్ చేసి ఆయన కరోనా సమయంలో పాకిస్థాన్‌కు 45 కోట్ల సహాయం చేశారంటూ ‘ఇండియా టీవీ’  కథనం పబ్లిష్ చేసినట్లు 2020లో షేర్ చేశారు అని పేర్కొంది.

‘The Lallantop’ కథనం ప్రకారం, 2017లో షారుఖ్ ఖాన్ పాకిస్థాన్‌ ఆయిల్ ట్యాంకర్ ప్రమాద బాధితుల సహాయార్థం పాకిస్థాన్‌కు  ₹ 45 కోట్లు అందజేశారా? అనే విషయం పై ఇండియా TV  షారుఖ్ ఖాన్ ఆఫీస్ సిబ్బందిని సంప్రదించగా ఆ ప్రచారంలో నిజం లేదని, ఆ ప్రచారం ఫేక్ అని వారు ఖండించారని తమ కథనంలో తెలిపింది. అలాగే షారుఖ్ 2017లో కానీ 2020లో కానీ పాకిస్థాన్‌కు ఎలాంటి విరాళాలు ఇవ్వలేదని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది.

కరోనా సమయంలో షారుఖ్ ఖాన్, అతని గ్రూప్ కంపెనీలు అనేక రిలీఫ్ ఫండ్‌లకు విరాళలు ఇచ్చినట్లు పలు రిపోర్ట్స్ లభించాయి(ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). వాటిలో ప్రధానమంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ (PM-CARES) ఫండ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌ కూడా ఉన్నాయి. హెల్త్‌కేర్ ప్రొవైడర్ల కోసం 50,000 వ్యక్తిగత రక్షణ పరికరాలు (PPE) కిట్‌లను షారుఖ్ ఖాన్ కు చెందిన IPL టీం KKR మరియు మీర్ ఫౌండేషన్  ద్వారా పశ్చిమ బెంగాల్ మరియు మహారాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్లు తెలుస్తుంది.

గతంలో కూడా షారుఖ్ ఖాన్ పాకిస్థాన్‌కు ఆర్దిక సహాయం చేశారంటూ పోస్టులు వైరల్ కాగా, వాటిని ఫాక్ట్-చెక్ చేస్తూ Factly పబ్లిష్ చేసిన కథనాన్ని ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

చివరగా, కరోనా సమయంలో హిందీ సినిమా నటుడు షారుఖ్ ఖాన్ పాకిస్థాన్‌కు 45 కోట్ల సహాయం చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll