Fake News, Telugu
 

ఈ వీడియోలో, ఆలయంలో ప్రార్థనలు చేస్తున్న మహిళ దుబాయ్ రాజు భార్య కాదు

0

దుబాయ్ రాజు ముహమ్మద్ బిన్ రషీద్ భార్య ఇటీవల తమిళనాడులోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఈ ఆర్టికల్ ద్వారా ఇందులోని నిజానిజాలు ఏంటో తెలుసుకొందాం. 

క్లెయిమ్: దుబాయ్ రాజు ముహమ్మద్ బిన్ రషీద్ భార్య తమిళనాడులోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శించినపుడు చిత్రించిన ఒక వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో 2019 నాటిది. ఇందులో కనిపిస్తున్న వ్యక్తి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) రాజకుటుంబ సభ్యురాలు షేఖా హెంద్ ఫైసల్ అల్-ఖస్సేమీ. ఆమె దుబాయ్ రాజు భార్య కాదు. అందువల్ల పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలాగా ఉంది.

ఇంటర్నెట్‌లో తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఈ వీడియో గురించి సెర్చ్ చెయ్యగా, వెల్లూరులోని శ్రీ పురం గోల్డెన్ టెంపుల్ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 2019లో అప్‌లోడ్ చేయబడిన ఒక వీడియో దొరికింది. ఈ వీడియోలోని విజువల్స్ వైరల్ వీడియోతో సరిపోలుతున్నాయి. వీడియో టైటిల్ ప్రకారం, ఇందులో కనిపిస్తున్న మహిళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) రాజకుటుంబ సభ్యురాలు షేఖా హెంద్ ఫైసల్ అల్-ఖస్సేమీ. తాను ఈ ఆలయాన్ని దర్శించుకొన్నపటి దృశ్యాలని తన ట్విట్టర్లో పోస్టు చేసినప్పుడు, కొందరు ముస్లింలు తనపై కోప్పడ్డారని ఇంటర్నెట్లో కొన్ని వార్త కథనాలు ఉన్నాయి (ఇక్కడ మరియు ఇక్కడ)

షేఖా హెంద్ ఫైసల్ అల్-ఖస్సేమీ నిజానికి UAE రాజకుటుంబానికి చెందిన సభ్యురాలు. అయితే, ఆమె దుబాయ్ రాజు ముహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ భార్య కాదు. 

చివరిగా, ఈ  వీడియోలోని మహిళ షేఖా హెంద్ ఫైసల్ అల్-ఖస్సేమీ, UAE యొక్క రాజకుటుంబానికి చెందినది, కానీ ఆమె దుబాయ్ రాజు భార్య కాదు. 

Share.

About Author

Comments are closed.

scroll