Fake News, Telugu
 

ఈ ఫొటోలో ఉన్నది బీహార్ కి చెందిన మాజీ కేంద్రమంత్రి దిగ్విజయ్ సింగ్ కూతురు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కూతురు కాదు.

0

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కుమార్తె షూటర్ శ్రేయాసి సింగ్ BJPలో చేరారు అని చెప్తూ దీనికి సంబంధించిన ఫోటో షేర్ చేసిన  పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే విషయాన్ని తెలుపుతున్న ఒక యూట్యూబ్ వీడియోను కూడా బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కుమార్తె షూటర్ శ్రేయాసి సింగ్ BJPలో చేరారు

ఫాక్ట్(నిజం): పోస్టులో చెప్పిన శ్రేయసి సింగ్ బీహార్ కి చెందిన మాజీ కేంద్రమంత్రి దిగ్విజయ్ సింగ్ కూతురు. ఐతే తనకి కాంగ్రెస్ పార్టీకి చెందిన మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కి ఎటువంటి సంబంధం లేదు. అసలు మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కి శ్రేయసి సింగ్ అనే కూతురు లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ విషయం గురించి సమాచారం కోసం గూగుల్ లో వెతకగా దీనికి సంబంధించిన వార్తా కథనాలు మాకు లభించాయి. ఐతే ఈ కథనాల ప్రకారం పోస్టులో చెప్పిన శ్రేయసి సింగ్ బీహార్ కి చెందిన మాజీ కేంద్ర మంత్రి దిగ్విజయ్ సింగ్ కూతురు. ఈయన చంద్ర శేఖర్ మరియు అటల్ బిహారి వాజపేయి హయాంలో కేంద్ర మంత్రిగా చేసాడు, ఈయన ప్రస్తుత BJP మిత్ర పక్షమైన నితీష్ కుమార్ నేతృత్వం లోని జనతాదళ్ యునైటెడ్ JD(U) పార్టీలో పని చేసి  తరవాత  అందులోనుండి  బయటికి వచ్చేసాడు.  దీన్నిబట్టి శ్రేయసి సింగ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కూతురు కాదని చెప్పొచ్చు.

పోస్టులో చెప్పిన శ్రేయసి సింగ్ కి కాంగ్రెస్ పార్టీకి చెందిన మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి , ప్రస్తుత రాజ్యసభ సభ్యుడైన దిగ్విజయ్ సింగ్ కి ఎటువంటి సంబంధంలేదు. అసలు ఈయనకు శ్రేయసి సింగ్ అనబడే కూతురు లేదు.  దిగ్విజయ్  సింగ్ ఇదే విషయాన్నీ ఖండిస్తూ తన ఫేస్బుక్ అకౌంట్లో షేర్ చేసిన పోస్ట్ ఇక్కడ చూడొచ్చు.

చివరగా, పోస్టులో చెప్పిన శ్రేయసి సింగ్ కి మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం లేదు. 

Share.

About Author

Comments are closed.

scroll