Fake News, Telugu
 

చైనాలోని ఒక వంతెన ఫొటోను యోగి అదిత్యనాథ్ ఉత్తర ప్రదేశ్లో నిర్మించిన దాని వలె షేర్ చేస్తున్నారు

0

షాంఘై నుంచి 3015 కిలోమీటర్ల దూరంలో ఉత్తర ప్రదేశ్‌లోని అక్బర్ పూర్ అంబేద్కర్ నగర్లో టోస్(టోన్స్) నదిపై యోగి అదిత్యనాథ్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన బ్రిడ్జ్ అని చెప్తూ ఒక ఫోటో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: యోగి అదిత్యనాథ్ ప్రభుత్వ హయాంలో ఉత్తర ప్రదేశ్‌లోని అక్బర్ పూర్ అంబేద్కర్ నగర్లో టోన్స్ నదిపై నిర్మించిన బ్రిడ్జ్ యొక్క ఫోటో.

ఫాక్ట్: ఈ వంతెన పేరు నాన్షా బ్రిడ్జ్‌. ఇది చైనాలోని గ్వాంగ్జౌ నగరంలో ఉంది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా వైరల్ ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫొటోని దుబాయ్‌కి చెందిన ఖలీజ్ మ్యాగజైన్ ట్విటర్ ఖాతా ద్వారా 07 మే 2023న షేర్ చేస్తూ చైనాలోని గ్వాంగ్జౌ నగరంలో ఉన్న నాన్షా బ్రిడ్జ్‌గా పేర్కొన్నారు.

దీని ఆధారంగా, ఈ బ్రిడ్జ్ గురించిన మరిన్ని వివరాలను వెతకగా, చైనా మీడియా సంస్థలు ప్రచురించిన ఫొటోలు, వీడియోలు లభించాయి. నాన్షా బ్రిడ్జ్ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఉంది. ఇది పెర్ల్ నదిపై ఉన్న సముద్రపు వంతెన. 2013లో దీని నిర్మాణాన్ని ప్రారంభించగా 2019 నాటికి పూర్తి చేశారు. ఈ వంతెన పొడవు 12.9 కి.మీ.

గూగుల్ ఎర్త్ లో కూడా ఈ బ్రిడ్జ్ యొక్క దృశ్యాలను చూడవచ్చు.

చివరిగా, చైనాలోని ఒక వంతెన ఫొటోను యోగి అదిత్యనాథ్ ఉత్తర ప్రదేశ్లో నిర్మించిన దాని వలె షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll