Fake News, Telugu
 

వీడియోలో ఉన్న మహిళ వైకాపా నాయకురాలు హిమబిందు రెడ్డి, ఏసీబీ న్యాయమూర్తి కాదు.

0

ఒక వీడియోలో, టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినందుకు గాను సంతోషాన్ని  వ్యక్తం చేస్తున్న మహిళ, ఏసీబీ న్యాయమూర్తి అని షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంత వాస్తవముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఏసీబీ న్యాయమూర్తి హిమబిందు రెడ్డి వైకాపా తరుపున మాట్లాడుతున్నారు.

ఫాక్ట్(నిజం): వీడియోలో ఉన్న మహిళ వైకాపా నాయకురాలు హిమబిందు రెడ్డి. టీడీపీ నాయకుడు చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పిన ఏసీబీ న్యాయమూర్తి పేరు బీ.సత్య వెంకట హిమబిందు. ఇద్దరూ వేరు వేరు వ్యక్తులు. కావున ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ఈ వీడియో గురించి తెలుసువటానికి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికితే ఇదే వీడియో హిమ బిందు రెడ్డి వైకాపా అనే యూట్యూబ్, ట్విట్టర్ మరియు ఇంస్టాగ్రామ్ అకౌంట్లలో దొరికింది. ఈ వీడియోలో ఉన్న మహిళ వైకాపా నాయకురాలు అయిన హిమ బిందు రెడ్డి.

క్లెయిమ్ గురించి మరింత వెతకగా, చంద్రబాబు నాయుడుకి రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పిన న్యాయమూర్తి పేరు బి. సత్య వెంకట హిమబిందు అని కృష్ణ డిస్ట్రిక్ట్ కోర్ట్ వెబ్సైటు ద్వారా తెలిసింది.

చివరిగా, వీడియోలో ఉన్న మహిళ వైకాపా నాయకురాలు హిమబిందు రెడ్డి, ఏసీబీ న్యాయమూర్తి కాదు.

Share.

About Author

Comments are closed.

scroll