ఒక మహిళ పాకిస్తాన్ సైనికుడికి గాజులు ఇస్తున్న ఫోటో ని ఫేస్బుక్ లో పెట్టి ‘భారత్ చేతిలొ చావుదెబ్బలు తింటున్న పాకిస్థాన్ ఆర్మీకి, గాజులను బహుమతిగా ఇచ్చిన పాక్ మహిళ’’ అని ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణ ఎంత వరకు వాస్తవమో విశ్లేషిద్దాం.
క్లెయిమ్: భారత్ చేతిలొ చావుదెబ్బలు తింటున్న పాకిస్థాన్ ఆర్మీకి గాజులను బహుమతిగా ఇస్తున్న పాక్ మహిళ.
ఫాక్ట్ (నిజం): పాకిస్తాన్ లో 2013 ఎన్నికల సందర్భంలో కరాచీ లోని పోలింగ్ బూత్ లలో రిగ్గింగ్ జరిగినందుకు గానూ నిరసనగా ఒక మహిళ పాక్ సైనికులకు గాజులు ఇస్తున్నప్పటి ఫోటో అది. భారత్ చేతిలో చావుదెబ్బలు తిన్నందుకు గాజులు ఇస్తుందని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
పోస్టులో ఉన్న ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, దానిని ఒక వినియోగదారుడు ‘Dailymotion’ ప్లాట్ఫారం మీద మే14, 2013న అప్లోడ్ చేసిన వీడియోలో కనుగొనబడింది. ఆ వీడియో యొక్క వివరణ ద్వారా, పాకిస్తాన్ లో 2013 ఎన్నికల సందర్భంలో, కరాచీ లోని పోలింగ్ బూత్ లలో ముత్తహిదా కౌమి మూవ్మెంట్ (MQM) అనే పార్టీ రిగ్గింగ్ కి పాల్పడినందువల్ల నిరసనగా ఒక మహిళ పాక్ సైనికులకు గాజులు చూపించినప్పటిదని తెలిసింది.
ఆ ఫోటో, పైన పేర్కొన్న సందర్భానికి సంబంధించినదని తెలుపుతూ లభించిన మరింత సమాచారాన్ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
పాకిస్తాన్ లో 2013 ఎన్నికల సందర్భంలో కరాచీ లోని పోలింగ్ బూత్ లలో రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చినట్లుగా వివిధ వార్తా సంస్థలు ప్రచురించిన కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చదవవచ్చు.
చివరగా, ఒక పాత ఫోటోని పెట్టి ‘భారత్ చేతిలొ చావుదెబ్బలు తింటున్న పాకిస్థాన్ ఆర్మీకి గాజులను బహుమతిగా ఇచ్చిన పాక్ మహిళ’ అని షేర్ చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?