పాకిస్తాన్‌లో ఒక ముస్లిం యువకుడు తన తల్లిని పెళ్లి చేసుకున్నాడని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: పాకిస్తాన్‌లో ఒక ముస్లిం యువకుడు తన తల్లిని పెళ్లి చేసుకున్నట్లు చూపిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): వీడియోలోని పాకిస్తానీ యువకుడు అబ్దుల్ అహద్ తన తల్లిని పెళ్లి చేసుకోలేదు. ఆమె 18 సంవత్సరాల తర్వాత మరో వ్యక్తిని పునర్వివాహం చేసుకున్న దృశ్యాలను వీడియో చూపిస్తుంది. దీని గురుంచి అబ్దుల్ అహద్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ కూడా చేసాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దీనికి సంబంధించిన 30 డిసెంబర్ 2024 నాటి హిందుస్థాన్ టైమ్స్ నివేదిక (ఆర్కైవ్ లింక్) లభించింది. ఈ నివేదిక ప్రకారం అబ్దుల్ అహద్ 18 సంవత్సరాల తర్వాత మరి వ్యక్తితో తన తల్లి పునర్వివాహనికి సహకరిస్తూ, ఆమె వివాహాన్ని ఏర్పాటు చేశాడు.
అబ్దుల్ అహద్ తన తల్లితో గడిపిన వివిధ సందర్భాలను వీడియో చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారని ఈ కథనం పేర్కొంది. దీని ఆధారంగా మేము అతని ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను కనుగొన్నాము. అక్కడ ఇదే వీడియో (ఆర్కైవ్ లింక్ ) “లీవింగ్ ఇట్ హియర్” అనే శీర్షికతో మరియు #లవ్,# మదర్, #నికా, #క్యూట్,మరియు #ఇన్స్టాగ్రామ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో అప్‌లోడ్ చేసిన వీడియో మాకు లభించింది.
తన తల్లి పెళ్లి వార్తను వెల్లడించిన తర్వాత తనకు లభించిన అపారమైన ప్రేమ మరియు మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతో అబ్దుల్ షేర్ చేసిన మరొక ఇన్స్టాగ్రామ్ పోస్టును (ఆర్కైవ్ లింక్) మాకు లభించింది.
ఈ సంఘటనను రిపోర్ట్ చేసిన పాకిస్తానీ మీడియా కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ (ఆర్కైవ్ లింక్ ఇక్కడ మరియు ఇక్కడ ) చూడవచ్చు.
చివరిగా, వీడియోలోని పాకిస్తానీ ముస్లిం యువకుడు తన తల్లిని పెళ్లి చేసుకున్నాడనే ప్రచారంలో ఎటువంటి నిజం లేదు.