ఫేస్బుక్ లో ఒక వీడియో ని పెట్టి, అందులో కనిపించేది పాకిస్తాన్ క్షిపణి ‘ఘజ్నవి’ అనీ, అది పరీక్షా సమయంలో విఫలమైందని చెప్తున్నారు. పోస్టులో చెప్పిన విషయం ఎంతవరకు వాస్తవమో విశ్లేషిద్దాం.
క్లెయిమ్: వీడియో పాకిస్తాన్ క్షిపణి ‘ఘజ్నవి’ విఫలం అవడానికి సంబంధించినది.
ఫాక్ట్ (నిజం): వీడియో రష్యా రాకెట్ ‘ప్రోటాన్-ఎమ్’ విఫలం అవడానికి సంబంధించినది. కావున, పోస్టులో చెప్పింది తప్పు.
ఇటీవల పాకిస్తాన్ దేశం క్షిపణి ‘ఘజ్నవి’ ని టెస్ట్ చేసినట్లుగా ‘The Nation’ వారి జనవరి 23, 2020 కథనం ద్వారా తెలుస్తుంది.
యూట్యూబ్ లో ‘Missile launch failed’ అని సెర్చ్ చేసినప్పుడు, చాలా రిజల్ట్స్ వచ్చాయి. వాటిలో వెతికినప్పుడు, పోస్టులో ఉన్న వీడియో లభించింది. దాని టైటిల్ “Russia’s Proton-M rocket undergoes rapid unscheduled disassembly” అని ఉంది. ఆ సమాచారంతో గూగుల్ లో వెతికినప్పుడు, ‘Euro News’ వారి న్యూస్ వీడియో ఒకటి లభించింది. అందులో, పోస్టులోని వీడియో లోని విజువల్స్ ని చూడవచ్చు. దాని ద్వారా, పోస్టులోని వీడియో రష్యా రాకెట్ ‘ప్రోటాన్-ఎమ్’ విఫలం అవడానికి సంబంధించినదని తెలుస్తుంది.
పాకిస్తాన్ వారి ‘ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR)’ యూట్యూబ్ వీడియో ద్వారా, ‘ఘజ్నవి’ క్షిపణి ని జనవరి 23, 2020న పాక్ విజయవంతంగా పరీక్షించిందని తెలుసుకోవచ్చు.
చివరిగా, పోస్టులోని వీడియో రష్యా రాకెట్ ‘ప్రోటాన్-ఎమ్’ విఫలం అవడానికి సంబంధించినది.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?