ఫేస్బుక్ లో ఒక వీడియో ని పెట్టి, ‘అస్సాం లోని బ్రహ్మపుత్ర లోయల్లో రాత్రి సమయంలో విద్యుత్తు రిక్షా నడిపేవారు విద్యుత్ ను ఆదా చేయడం కోసం లైట్లు ఆఫ్ చేసి రిక్షాలను నడపడం మూలంగా ఆక్సిడెంట్ లు బాగా పెరిగిపోయాయని ఆ కారణం చేత పోలీస్ శాఖ వారు ఈ విధంగా హెడ్ లైట్లను పగలగొడుతున్నారు’ అని దాని గురించి పోస్టు చేస్తున్నారు. పోస్టులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో పరిశీలిద్దాం.
క్లెయిమ్: వీడియోలో అస్సాం పోలీస్ వారు ఎలక్ట్రిక్ రిక్షా డ్రైవర్లు హెడ్ లైట్లను ఆఫ్ చేసి వాటిని నడుపుతున్నందుకుగాను వాహనాలను ధ్వంసం చేశారు.
ఫాక్ట్ (నిజం): వీడియోలోని ఘటన వెస్ట్ బెంగాల్ లోని బర్ధమాన్ లో జరిగింది. బర్ధమాన్ లోని ‘గర్జన్’ రోడ్డులో ఆఫీసు వేళల్లో ఎలక్ట్రిక్ రిక్షాలకు అనుమతి లేకపోవడంతో, ఆ మార్గాన వచ్చిన ఎలక్ట్రిక్ రిక్షాలను పోలీసులు ధ్వంసం చేశారు. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్టులో వీడియో యొక్క స్క్రీన్ షాట్లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఒక స్క్రీన్ షాట్ ‘News18’ వారి న్యూస్ వీడియో లో లభించింది. వెస్ట్ బెంగాల్ లోని బర్ధమాన్ లో ‘గర్జన్’ రోడ్డులో ఆఫీసు వేళల్లో ఎలక్ట్రిక్ రిక్షాలకు అనుమతి లేకపోవడం చేత ఆ మార్గాన వచ్చిన ఎలక్ట్రిక్ రిక్షాల హెడ్ లైట్లను పోలీసులు ధ్వంసం చేశారని ఆ వీడియో ద్వారా తెలిసింది.
చివరగా, వీడియోలో పోలీస్ వారు ఎలక్ట్రిక్ రిక్షా హెడ్ లైట్లను పగలగొడుతున్న ఘటన వెస్ట్ బెంగాల్ లో జరిగింది.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: వీడియోలో పోలీస్ వారు ఎలక్ట్రిక్ రిక్షా హెడ్ లైట్లను పగలగొడుతున్న ఘటన వెస్ట్ బెంగాల్ లో జరిగిం