Fake News, Telugu
 

ఫోటోలో ఉన్నది నిజమైన అస్థిపంజరం కాదు; దానితో భారతదేశానికి సంబంధంలేదు

0

తుపాకీ తో ఉన్న ఒక మానవ అస్థిపంజరం ఫోటోని పెట్టి, అది భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన మహా యోధునికి సంబంధించినట్టు సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ చేస్తున్నారు. ఆ ఫోటోలో ఉన్నది 1965 యుద్ధంలో పాల్గొన్న భారత సైనికుడని కూడా మరికొందరు హిందీలో పోస్ట్ చేసారు. పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఫోటోలో ఉన్నది భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుడి అస్థిపంజరం.

ఫాక్ట్: ఫోటోలో ఉన్నది నిజమైన అస్థిపంజరం కాదు. అది ‘దిలీప్ సర్కార్ ఎంబీఈ’ అనే వ్యక్తి 2017 లో తయారు చేసిన ఒక మోడల్. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటోని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అలాంటి ఫోటోలే కొన్ని సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. ఆ ఫోటోల్లో ఉన్నది ఒక మోడల్ అని కొందరు రాసారు. ఆ మోడల్ ని తయారు చేసింది ‘దిలీప్ సర్కార్ ఎంబీఈ’ అని ఒక ఫోటోలో రాసి ఉన్నట్టు చూడవొచ్చు.

‘దిలీప్ సర్కార్ ఎంబీఈ’ యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్ లో వెతకగా, పోస్ట్ లోని ఫోటోని తను జనవరి 2018 లో పోస్ట్ చేసినట్టు కనిపిస్తుంది. ఆ మోడల్ ని ఒక మ్యాగజిన్ ఆర్టికల్ కోసం తను తయారు చేసానని, దానిని తయారు చేయడానికి ‘vintage Airfix 1/6 scale skeleton’ మరియు ‘Dragon Action figures bits’ ఉపయోగించినట్టు పోస్ట్ లో తెలిపాడు.

ఇదే ఫోటో 2018 లో టర్కీ సైనికుడి అస్థిపంజరం అని వైరల్ అయినప్పుడు ‘Teyit’ సంస్థ వారు ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్ రాసారు. ఆ మోడల్ ని 2017 లో తయారు చేసానని, అందులో ఉన్న అస్థిపంజరం ‘Alman’ (ఆంగ్ల అనువాదం – జర్మన్ లేద డచ్) సైనికుడిని సూచిస్తుందని దిలీప్ సర్కార్ తమతో తెలిపినట్టు ‘Teyit’ రిపోర్ట్ చేసింది. ఆ మోడల్ ని తయారు చేసిన విధానాన్ని ‘Military Modelling’ మాగజీన్ లో చూడవొచ్చు.

చివరగా, ఫోటోలో ఉన్నది నిజమైన అస్థిపంజరం కాదు; దానితో భారతదేశానికి సంబంధంలేదు.

Share.

About Author

Comments are closed.

scroll