Fake News, Telugu
 

ఫోటోలోని కుటుంబ నియంత్రణ బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టింది మోదీ ప్రభుత్వం కాదు

0

ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లల వరకు ఉన్న వారికే ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉంచుతూ, కుటుంబ నియంత్రణ లేని వారికి రాయితీలు తీసేయాలని మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టిందని ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కుటుంబ నియంత్రణ లేని వారికి రాయితీలు తీసేస్తూ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన మోడీ ప్రభుత్వం.

ఫాక్ట్ (నిజం): ఫోటోలోని బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టింది శివసేన పార్టీకి చెందిన అనిల్ దేశాయ్. అది ప్రైవేటు మెంబెర్ బిల్. మోదీ ప్రభుత్వం దాన్ని ప్రవేశపెట్టలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ చేసిన ఫోటోలోని బిల్లుని ఫిబ్రవరి 7 న శివసేన పార్టీకి చెందిన అనిల్ దేశాయ్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. పూర్తి బిల్లుని ఇక్కడ చదవొచ్చు.

అది ఒక ప్రైవేటు మెంబెర్ బిల్. మోడీ ప్రభుత్వం దాన్ని ప్రవేశపెట్టలేదు. ప్రైవేటు మెంబెర్ బిల్లులు చాలా అరుదుగా పార్లమెంట్ ద్వారా ఆమోదించబడుతాయి. 1952 నుండి కేవలం 14 ప్రైవేటు మెంబెర్ బిల్లులు మాత్రమే ఆమోదించబడ్డాయని ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

చివరగా, ఫోటోలోని కుటుంబ నియంత్రణ బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టింది మోదీ ప్రభుత్వం కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll