Fake News, Telugu
 

ఈ ఫొటోలో ప్రధాన మంత్రి మోడీ భార్య ‘జశోదా బెన్’ CAA మరియు NRC కి వ్యతిరేకంగా నిరసన తెలుపట్లేదు

0

ఒక ఫోటో ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. అది సీఏఏ (పౌరసత్వ సవరణ బిల్లు), ఎన్ఆర్సి (జాతీయ పౌరుల రిజిస్టర్) మరియు ఎన్పీఆర్ (జాతీయ జనాభా రిజిస్టర్) లకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రదర్శనల్లో ప్రధాని మోడీ భార్య ‘జశోదా బెన్’ పాల్గొనడానికి సంబంధించినదని పేర్కొంటున్నారు. పోస్టులో చెప్పినదాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సీఏఏ, ఎన్ఆర్సి మరియు ఎన్పీఆర్ లకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రదర్శనల్లో ‘జశోదా బెన్’ పాల్గొనడానికి సంబంధించిన ఫోటో. 

ఫాక్ట్ (నిజం): ఫోటో 2016 లో ‘జశోదా బెన్’ వర్షా కాలాల్లో మురికివాడలను కూల్చివేయడానికి వ్యతిరేకంగా ముంబై లో చేసిన నిరాహార దీక్షది. కావున, పోస్టులో చెప్పింది తప్పు.

పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే ఫొటోతో ఉన్న ‘Deccan  Chronicle’ ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చింది. ఆ కథనం ద్వారా ఫోటో 2016 లో ‘జశోదా బెన్’ వర్షా కాలాల్లో మురికివాడలను కూల్చివేయడానికి వ్యతిరేకంగా ముంబై లోని ఆజాద్ మైదానంలో చేసిన నిరాహార దీక్షదని తెలిసింది. కావున, ఫోటోకీ మరియు దేశంలో ప్రస్తుతం సీఏఏ, ఎన్ఆర్సి మరియు ఎన్పీఆర్ వ్యతిరేకంగా జరుగుతున్న ప్రదర్శనలకి ఎటువంటి సంబంధం లేదు. 

చివరగా, పోస్టులోని ఫోటో 2016 లో ‘జశోదా బెన్’ వర్షా కాలాల్లో మురికివాడలను కూల్చివేయడానికి వ్యతిరేకంగా ముంబై లో చేసిన నిరాహార దీక్షది. 

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll