ఒక ఫోటో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, అందులో కర్నూలు MLA (హఫీజ్ ఖాన్) తన మతపెద్దకు నర్సు తో కాళ్ళు మొక్కిపిస్తున్నాడనీ, ఆ సంఘటన విశ్వభారతి మెడికల్ కాలేజ్ లో జరిగిందనీ చెప్తున్నారు. కానీ, FACTLY విశ్లేషణ లో ఆ ఫోటో గురించి చేసిన ఆరోపణ తప్పని తేలింది. కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ లోని వైద్య సదుపాయాలను పరిశీలించడానికి వెళ్ళారు. ఆయన క్వారంటైన్ సెంటర్ లోని వైద్య సౌకర్యాల గురించి అక్కడున్న సిబ్బందిని అడిగి తెలుసుకునే సమయంలో ఓ ముస్లిం వ్యక్తి కాలికి గేట్ తగిలి రక్తస్రావమైంది. దాంతో అక్కడే విధుల్లో ఉన్న ఓ నర్సు ఆ వ్యక్తి గాయాన్ని శుభ్రపరిచి కట్టు కట్టింది. ఫోటో ఆ సందర్భం లో తీసినది. ఆ ఘటనకి సంబంధించిన వీడియోలో ఆ వ్యక్తి కాలికి రక్తం చూడవొచ్చు.
సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. న్యూస్ ఆర్టికల్ – https://telugu.oneindia.com/news/andhra-pradesh/mla-hafeez-khan-clarifies-about-the-fake-videos-circulating-on-him/articlecontent-pf269178-267556.html
2. న్యూస్ ఆర్టికల్ – https://www.sakshi.com/news/politics/fake-news-ysrcp-mla-hafeez-khan-fact-revealed-1280085
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?