Fake News, Telugu
 

ఈ వీడియోలో ఉన్నది నటి ఉర్ఫీ జావెద్, కర్ణాటక హిజాబ్ వివాదంలో వైరల్ అయిన ముస్కాన్ ఖాన్ కాదు

0

కర్ణాటకలో జరిగిన హిజాబ్ వివాదంలో వైరల్ అయిన ముస్కాన్ ఖాన్ ఇలా అర్థనగ్నంగా తిరుగుతున్న వీడియో అంటూ ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇటీవల కర్ణాటకలో కొందరు వ్యక్తులు ‘జై శ్రీ రామ్’ అని ముస్కాన్ ముందు నినాదాలు చేయగా, వారికి బదులిస్తూ తను ‘అల్లా హు అక్బర్’ అన్న వీడియో చాలా వైరల్ అయింది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కర్ణాటక హిజాబ్ వివాదంలో వైరల్ అయిన ముస్కాన్ ఖాన్ అర్థనగ్నంగా తిరుగుతున్న వీడియో.

ఫాక్ట్: వీడియోలో ఉన్నది నటి ఉర్ఫీ జావెద్, ముస్కాన్ ఖాన్ కాదు. ఉర్ఫీ జావెద్ స్పోర్ట్స్ బ్రా వేస్కొని జింకి వెళ్తున్న సమయంలో తీసిందే ఈ వీడియో. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే వీడియో యూట్యూబ్‌లో లభించింది. NBT Entertainment వారి అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌లో ఇదే వీడియోను 07 ఫిబ్రవరి 2022న అప్లోడ్ చేసారు. ఇది ఉర్ఫీ జావెద్ వీడియో అని, తను స్పోర్ట్స్ బ్రా వేస్కొని జిమ్‌కి వెళ్తున్న సమయంలో తీసిన వీడియో అని తెలిపారు.

హిందీలో జరిగిన ‘బిగ్ బాస్ ఓటీటీ’ కాంటెస్టెంట్ గా పాల్గొన్న నటి ఉర్ఫీ జావెద్, తరచూ ఇటువంటి డ్రెస్సులను ధరించి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. హిజాబ్ వివాదంపై తన అభిప్రాయం అడిగినప్పుడు మహిళలు తమకి నచ్చిన దుస్తులు ధరించవొచ్చని ఆమె తెలిపారు.

చివరగా, ఈ వీడియోలో ఉన్నది నటి ఉర్ఫీ జావెద్, కర్ణాటక హిజాబ్ వివాదంలో వైరల్ అయిన ముస్కాన్ ఖాన్ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll