Fake News, Telugu
 

ఎడిట్ చేసిన వీడియోని, పెట్రోల్ ధర గురించి అడిగిన వ్యక్తిని మోదీ కూర్చోమని చెప్పినట్టు షేర్ చేస్తున్నారు

0

వీడియో కాన్ఫరెన్స్ లో ఒక వ్యక్తి పెట్రోల్ ధర గురించి అడగగానే అతన్ని కూర్చోమని ప్రధాని మోదీ అన్నట్టు చెప్తూ, ఒక వీడియోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వీడియోలో పెట్రోల్ ధర గురించి అడిగిన వ్యక్తిని కూర్చోమని చెప్తున్న ప్రధాని మోదీ.

ఫాక్ట్: పోస్ట్ చేసినది ఒక ఎడిట్ చేసిన వీడియో. అసలు వీడియోలో మోదీ తో ఆ వ్యక్తి అసలు పెట్రోల్ ధర గురించి మాట్లాడలేదని చూడవొచ్చు  కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

వీడియోలోని వ్యక్తిని ‘హరిబావు’ అని మోదీ సంబోధించినట్టు వీడియోలో వినొచ్చు. కావున, కీ-వర్డ్స్ తో ఇంటర్నెట్ లో వెతకగా, వీడియోలోని వ్యక్తి ముద్రా పథకం లబ్దిదారుడని, అతనితో మోదీ మరాఠీ భాషలో మాట్లాడాడని 2018 లో ‘ABP MAJHA’ వార్తాసంస్థ యూట్యూబ్ లో పెట్టిన వీడియోని చూడవొచ్చు. పెట్రోల్ ధర గురించి మాట్లాడినట్టు వీడియోలో లేదు.

ఆ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వీడియోని ‘PMO India’ యూట్యూబ్ ఛానల్ లో చూడవొచ్చు. ఒరిజినల్ వీడియోలో ‘నమస్తే సర్’ అని అన్న దగ్గర పోస్ట్ చేసిన వీడియోలో ‘రామ్ రామ్’ అని, ‘ఠీక్ హై సర్’ అని అన్న దగ్గర ‘పెట్రోల్ కే భావ్’ అని ఎడిట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ వ్యక్తి అసలు పెట్రోల్ ధర గురించి మాట్లాడలేదని అసలు వీడియోలో చూడవొచ్చు.

చివరగా, ఎడిట్ చేసిన పెట్టి, పెట్రోల్ ధర గురించి అడిగిన వ్యక్తిని మోదీ కూర్చోమని చెప్పిన్నట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll