Fake News, Telugu
 

సంబంధంలేని పిల్లల పాత దృశ్యాలను ప్రస్తుత రష్యా-ఉక్రెయిన్‌ పరిస్థితులకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

ప్రస్తుతం రష్యా మరియు ఉక్రెయిన్‌ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పిల్లలకు సంబంధించి కొన్ని వీడియోలు మరియు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పోస్ట్‌లలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

పోస్ట్ 1:

క్లెయిమ్: ఉక్రెయిన్ బాలిక రష్యా సైనికుడుని మా దేశం వదిలి మీ దేశానికి వెళ్లండని చెప్తున్న వీడియో.

ఫాక్ట్: పోస్ట్‌లోని వీడియో చాలా పాతది. అంతేకాదు, వీడియో రష్యా లేదా ఉక్రెయిన్‌కి సంబంధించినది కాదు. వీడియోలో ఇజ్రాయెల్ సైనికుడిపై పాలస్తీనా అమ్మాయి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. కావున, పోస్ట్‌లో ‘ఉక్రెయిన్ బాలిక రష్యా సైనికుడు’ అని రాస్తూ తప్పుదోవ పట్టుస్తున్నారు.

యూట్యూబ్‌లో అదే వీడియోని ఒకరు 2012లోనే పోస్ట్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. వీడియోలో ఉన్నది పాలస్తీనా అమ్మాయి అహెద్ తమీమీ. తన గురించి మరియు వీడియోలో ఉన్న ఘటన గురించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ మరియు ఇక్కడ చదవచ్చు.

పోస్ట్ 2:

క్లెయిమ్: ఒక్క పసి పాపను కాపాడటానికి ముగ్గురు ఉక్రెయిన్ జవాన్లు తమ ప్రాణాలను పణంగా పెడుతున్న వీడియో.

ఫాక్ట్: పోస్ట్‌లోని వీడియో ఉక్రెయిన్‌ జవాన్లకి సంబంధించినది కాదు. ఆ వీడియోని ఇరాక్‌లో తీసారు. కావున, పోస్ట్‌లో ‘ఉక్రెయిన్ జవాన్లు’ అని రాస్తూ తప్పుదోవ పట్టుస్తున్నారు.

‘సీబీఎస్ మార్నింగ్స్’ యూట్యూబ్ ఛానల్ పోస్ట్‌లోని వీడియోని 2017లోనే పోస్ట్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. వీడియోని ఇరాక్‌లో తీసినట్టు ఆ వీడియో వివరణలో చదవచ్చు. ఆ వీడియోకి సంబంధించిన మరిన్ని వివరాలు ‘డైలీ మెయిల్’ అర్టికల్‌లో చదవచ్చు.

మరిన్ని ఫోటోలు కూడా ఉక్రెయిన్‌కి సంబంధించిన తాజా దృశ్యాలుగా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. అయితే, అందులో ఒకటి పాత ఫోటో కాగా, మరో ఫోటో ఒక సినిమాకి సంబంధించినది.

ప్రస్తుత రష్యా-ఉక్రెయిన్ వివాదానికి సంబంధించిన కొన్ని దృశ్యాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, సంబంధంలేని పిల్లల పాత దృశ్యాలను ప్రస్తుత రష్యా-ఉక్రెయిన్‌ పరిస్థితులకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll