ప్రధాని మోదీ ఫోటోకి అగ్గి పెట్టాలని ఒక వ్యక్తి అనుకున్నాడని, అయితే చివరికి ఆ వ్యక్తికే అగ్గి అంటుకుందని చెప్తూ ఒక వీడియోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. “నిజాయితీ పవర్ ఏంటో ప్రకృతి తిరిగి చూపెట్టింది”, లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఆ వీడియోని పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ప్రధాని మోదీ ఫోటోకి అగ్గి పెట్టాలని చుసిన వ్యక్తికే చివరికి అగ్గి అంటుకున్నట్టు వీడియోలో చూడవచ్చు.
ఫాక్ట్: వీడియోలోని వ్యక్తి సమాజ్‌వాదీ పార్టీకి చెందినవాడు. తాజగా జరిగిన 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ ఓడిపోవడంతో తను ఆత్మాహుతి చేసుకునేందుకు ప్రయత్నించాడు. పోస్ట్‌లో చెప్పినట్టు ఏదో ఫోటోకి అగ్గి పెట్టాలని చూసినప్పుడు ప్రమాదవశాత్తు తనకి అగ్గి అంటుకోలేదు. కావాలనే తనకు తానే అగ్గి అంటించుకున్నాడు. కావున పోస్ట్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, ఆ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగినట్టు తెలిసింది. వీడియోలోని వ్యక్తి సమాజ్‌వాదీ పార్టీకి (ఎస్పీ) సంబంధించిన వాడు అని, తాజగా జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ ఓడిపోవడంతో తను ఆత్మాహుతి చేసుకునేందుకు ప్రయత్నించాడని ‘ఇండియా టుడే’ అర్టికల్‌లో చదవచ్చు. ఇదే విషయం చెప్తూ వివిధ వార్తాసంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవచ్చు.
పోస్ట్‌లో చెప్పినట్టు ఏదో ఫోటోకి అగ్గి పెట్టాలని చూసినప్పుడు ప్రమాదవశాత్తు తనకి అగ్గి అంటుకోలేదు. కావాలనే తనకు తానే అగ్గి అంటించుకున్నాడు. ‘ఈటీవీ భారత్’ వారితో నరేంద్ర సింగ్ (వీడియోలోని వ్యక్తి) మాట్లాడుతూ ఈవీఎంలను బీజేపీ మారుస్తుందని, వాటి వల్లే అఖిలేష్ ఓడిపోతున్నాడని చెప్పినట్టు ఇక్కడ చదవచ్చు. అంతేకాదు, ఎక్కువ నిడివి గల వీడియోని చూడగా, అందులో నరేంద్ర సింగ్ అగ్గి అంటించుకునే ముందు, బాటిల్ నుండి తనపైనే పెట్రోల్ పోసుకుంటున్నట్టు చూడవచ్చు. మరొక వీడియోలో తన శరీరానికి తానే అగ్గి అంటించుకుంటునట్టు చూడవచ్చు.
చివరగా, ప్రధాని మోదీ ఫోటోకి అగ్గి పెట్టాలని చూస్తే ప్రమాదవశాత్తు అగ్గి అంటుకోలేదు; తనకు తానే అంటించుకున్నాడు.