Fake News, Telugu
 

అమెరికన్ ప్రొఫెసర్ లారెన్స్ యోసెఫ్ ముస్లింల ప్రార్ధనను ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేసారనడానికి ఎటువంటి ఆధారాలు లేవు

0

ముస్లింలు ఈ భూమిపై తవాఫ్ లేదా ప్రార్థనలు చేయడం మానేస్తే ఖచ్చితంగా భూభ్రమణం ఆగిపోతుందని చెప్పిన అమెరికన్ ప్రొఫెసర్ లారెన్స్ యోసెఫ్ అని అంటూ ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ముస్లింలు ఈ భూమిపై తవాఫ్ లేదా ప్రార్థనలు చేయడం మానేస్తే ఖచ్చితంగా భూభ్రమణం ఆగిపోతుందని చెప్పిన అమెరికన్ ప్రొఫెసర్ లారెన్స్ యోసెఫ్.

ఫాక్ట్: అమెరికన్ ప్రొఫెసర్ లారెన్స్ యోసెఫ్ అనే వ్యక్తి ముస్లింలు భూమిపై తవాఫ్ చేయడం మానేస్తే ఖచ్చితంగా భూభ్రమణం ఆగిపోతుందని అన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు. దీనికి శాస్త్రీయమైన ఆధారాలు కూడా లేవు. ఇండోనేషియాకు సంబంధించిన రచయిత ఆగుస్ ముస్తోఫా తన పుస్తకం ‘ఇస్లాం డిజిటల్’లో, ఇది తప్పుడు సమాచారం అని, ఇటువంటి వాటి వల్ల ఇస్లాంకి చెడ్డపేరు వస్తుందని తెలిపారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇటువంటి క్లెయిమ్ సోషల్ మీడియాలో 2020 నుండి వైరల్ అవుతోందని తెలిసింది. (ఇక్కడ మరియు ఇక్కడ).

కానీ, అమెరికన్ ప్రొఫెసర్ లారెన్స్ యోసెఫ్ అనే వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేసాడని ఎక్కడా కూడా కచ్చితమైన సమాచారం లభించలేదు. అటువంటి వ్యాఖ్యలు గనక నిజంగానే చేసి ఉంటే, అన్ని ప్రముఖ వార్తాపత్రికలు ప్రచురించేవి. 15 విశ్వవిద్యాలయాల్లో కాబాపై ఇటువంటి పరిశోధనలు జరిగినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు.

ముస్లింలు ఈ భూమిపై తవాఫ్ లేదా ప్రార్థనలు చేయడం మానేస్తే ఖచ్చితంగా మన భూభ్రమణం ఆగిపోతుందనడానికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు కూడా లేవు.

ఇండోనేషియాకు సంబంధించిన రచయిత ఆగుస్ ముస్తోఫా, ‘ఇస్లాం డిజిటల్’ అనే పుస్తకం రాసాడు. అందులో, ఇస్లాం పేరు మీద కొన్ని అవాస్తవమైన విషయాలను షేర్ చేస్తున్నారని, దీన్ని కౌంటర్ చేస్తూ ఈ పుస్తకంలో సమాచారం ప్రచురించినట్టు తెలిపారు. అసలు ప్రొఫెసర్ లారెన్స్ యోసెఫ్ అనే వ్యక్తి లేడని, 15 విశ్వవిద్యాలయాల్లో కాబాపై ఇటువంటి పరిశోధనలు జరిగాయనే సమాచారం కూడా లేదని తెలిపారు.

చివరగా, అమెరికన్ ప్రొఫెసర్ లారెన్స్ యోసెఫ్ అనే వ్యక్తి ముస్లింల ప్రార్ధనలను ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేసారనడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll