Fake News, Telugu
 

మీడియా తెలిపినట్టు మార్చి 16 నుండి మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు పై అన్ని సేవలు నిలిపివేయబడవు

0

‘ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం మీ దగ్గరున్న డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులను ఇప్పటిదాకా వాడకపోయినైట్లెతే ఇకపై అవి పనిచేయవు’ అని పలు వార్తా సంస్థలు ప్రచురించినట్టు కొంత మంది ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులను ఒక్కసారైనా ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం వాడకపోయినైట్లెతే మార్చి 16 నుండి అవి పనిచేయవు.

ఫాక్ట్ (నిజం): డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులను ఒక్కసారైనా ఇంటర్నేషనల్, ఆన్లైన్, మరియు కాంటాక్ట్ లెస్ లావాదేవీల కోసం వాడకపోయినైట్లెతే మార్చి 16 నుండి ఆ కార్డు పై ఉన్న ఇంటర్నేషనల్, ఆన్లైన్, మరియు కాంటాక్ట్ లెస్ సేవలు ఆగిపోతాయి. కార్డులు పనిచేయకుండా పోవు. వాటిని ఏటీఎం మరియు పాయింట్ ఆఫ్ సేల్ పరికరాల వద్ద వాడొచ్చు. కావున పోస్ట్ లో కార్డులు పనిచేయవని చెప్తూ తప్పుదోవ పట్టిస్తున్నారు. 

ఈ వార్తను నమస్తే తెలంగాణ (ఆర్కైవ్డ్), టీవీ9 (ఆర్కైవ్డ్), ఈనాడు సిరి (ఆర్కైవ్డ్) మరియు V6 వెలుగు (ఆర్కైవ్డ్) వార్తా సంస్థలు ప్రచురించినట్టు చూడవొచ్చు.

ఆ ఆర్టికల్స్ చదువుతే, పోస్టులోని విషయాన్ని తెలుపుతూ జనవరి 15, 2020న ఆర్‌బీఐ నోటిఫికేషన్‌ విడుదల చేసిందని రాసి ఉంటుంది. కావున, ఆ నోటిఫికేషన్ కోసం ఆర్బీఐ వెబ్సైటులో వెతకగా, నిజంగానే అలాంటి నోటిఫికేషన్ ఒకటి ఆర్బీఐ విడుదల చేసినట్టు తెలుస్తుంది. కానీ, ఆ నోటిఫికేషన్ సరిగ్గా చదువుతే, డెబిట్‌ మరియు క్రెడిట్‌ కార్డులను ఒక్కసారైనా ఇంటర్నేషనల్ (అంతర్జాతీయ), ఆన్లైన్, మరియు కాంటాక్ట్ లెస్ లావాదేవీల కోసం వాడకపోయినైట్లెతే మార్చి 16 నుండి ఆ కార్డు పై ఉన్న ఇంటర్నేషనల్, ఆన్లైన్, మరియు కాంటాక్ట్ లెస్ సేవలు నిలివేస్తారని ఉంటుంది. కార్డులు పనిచేయకుండా పోవు. వాటిని ఏటీఎం మరియు పాయింట్ ఆఫ్ సేల్(స్వైపింగ్ మెషిన్) పరికరాల వద్ద వాడొచ్చు.

వినియోగదారుల సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి మరియు కార్డు లావాదేవీల భద్రతను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. ఇకపై ఇచ్చే కార్డుల పై కేవలం ఎటిఎంలు మరియు పాయింట్ ఆఫ్ సేల్ పరికరాలకు సంబంధించిన సేవలే ఇవ్వాలని, మిగితా సేవలను (ఇంటర్నేషనల్, ఆన్లైన్ మరియు కాంటాక్ట్ లెస్ లావాదేవీలు) వినియోగదారుడు కోరితేనే ఇవ్వమని బ్యాంకులను ఆర్‌బీఐ కోరింది.

చివరగా, కార్డులను ఒక్కసారైనా ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం వాడకపోయినైట్లెతే మార్చి 16 నుండి కేవలం ఆన్‌లైన్‌ సేవలు మాత్రమే ఆగిపోతాయి.  కార్డులు పని చేయకుండా పోవు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll