Fake News, Telugu
 

ఈ వీడియోలో ‘కచ్చా బాదం’ పాటకు డాన్స్ చేస్తున్నది చలనచిత్ర నటీనటులు, నిజమైన పోలీసు అధికారులు కాదు

0

‘కచ్చా బాదం’ పాటకు పోలీసులు స్టెప్పులేస్తున్న దృశ్యాలు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. ఖాకీ యూనిఫాం ధరించిన కొందరు పోలీసులు ‘కచ్చా బాదం’ పాటకు డాన్స్ చేస్తున్న వీడియోని ఈ పోస్టులో షేర్ చేసారు. ప్రముఖ వార్తా సంస్థ ‘టీవీ 9’ కూడా ఈ వీడియోని ఇదే వివరణతో ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

    ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘కచ్చా బాదం’ పాటకు పోలీసులు స్టెప్పులేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్: ఈ వీడియోలో ‘కచ్చా బాదం’ పాటకు డ్యాన్స్ చేస్తున్నది నిజమైన పోలీస్ అధికారులు కాదు. పోలీస్ యూనిఫాం ధరించి ఈ వీడియోలో డాన్స్ వేస్తున్నది ‘రకచ్చాషి’ అనే సినిమాలో పనిచేస్తున్న నటీనటులు. ‘రకచ్చాషి’ సినిమాలో నటిస్తున్న ప్రీతి గోస్వామి ఈ వీడియోని 08 మర్చి 2022 నాడు తన ఇన్స్టాగ్రామ్ పేజిలో కూడా షేర్ చేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.  

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, కేరళ పోలీసులు ‘కచ్చా బాదం’ పాటకు చిందులేస్తున్న దృశ్యాలంటూ కొన్ని వార్తా సంస్థలు ఇటీవల ఈ వీడియోని పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం వెతికితే, ఈ వీడియోకి సంబంధించిన వివరాలని తెలుపుతూ ‘మాతృభూమి’ వార్తా సంస్థ 30 మార్చి 2022 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలో పోలీస్ యూనిఫాం ధరించి ‘కచ్చా బాదం’ పాటకు డాన్స్ చేస్తున్నది ‘రకచ్చాషి’ అనే సినిమాలో పనిచేస్తున్న నటీనటులని ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. ‘Hotel Dewland’ యాజమాన్యం ఈ విషయాన్ని తమకు స్పష్టం చేసినట్టు ఆర్టికల్‌లో తెలిపారు. పోస్టులో షేర్ చేసిన వీడియోని జాగ్రత్తగా గమనిస్తే, వీడియోలో కనిపిస్తున్న ఒక బోర్డుపై ‘Hotel Dewland’ అని రాసి ఉండటాన్ని చూడవచ్చు.

‘రకచ్చాషి’ సినిమాలో నటిస్తున్న ప్రీతీ గోస్వామి ఈ వీడియోని 08 మర్చి 2022 నాడు తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది.

ప్రీతీ గోస్వామి షేర్ చేసిన మరొక ఇన్స్టాగ్రామ్ వీడియోలో కూడా తను ‘కచ్చా బాదం’ పాటకు డాన్స్ చేస్తున్న దృశ్యాలని చూడవచ్చు. ఈ సినిమాలో నటిస్తున్న మరొక నటి కూడా అదే లోకేషన్‌లో వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసింది.

ప్రీతి గోస్వామి ‘Hotel Dewland’లో దిగిన మరికొన్ని ఫోటోలని ఇక్కడ చూడవచ్చు. ‘రకచ్చాషి’ సినిమాకి సంబంధించిన మరికొన్ని దృశ్యాలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఈ వీడియోలో ‘కచ్చా బాదం’ పాటకు డాన్స్ చేస్తున్నది చలనచిత్ర నటీనటులు, నిజమైన పోలీసు అధికారులు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll