Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ఫోటోలో ఉన్నది రాజస్తాన్ లో 47 సార్లు పదో తరగతి పరీక్ష ఫెయిలైన శివ్ చరణ్ యాదవ్.

0

ఫోటోలో ఉన్నది హైదరబాద్ కి చెందిన బర్కత్ అలీ అని, తను ఇప్పటికి పదో తరగతి పరీక్ష 47 సార్లు రాసి ఫెయిల్ అయ్యాడని , కొరోనా వల్ల తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ ఫైనల్ పరీక్షలు రద్దు చేయడంతో ఇప్పుడు పాస్ అయ్యాడు అని సోషల్ మీడియాలో చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. అయితే, ఆ ఫోటోలో ఉన్నది రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన శివ్ చరణ్ యాదవ్ అని, తను ‘రాజస్థాన్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్’ వారి పదో తరగతి పరీక్ష 47 సార్లు రాసి ఫెయిల్ అయినట్టు FACTLY విశ్లేషణ లో తేలింది. 47 వ సారి తను 2016 లో పదో తరగతి పరీక్ష రాసాడని, అప్పుడు కూడా తను ఫెయిల్ అయినట్టు వివిధ వార్తాసంస్థలు ప్రచురించిన ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. అంతేకాదు, రాజస్తాన్ ప్రభుత్వం ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా, మిగిలిన పదో తరగతి పరీక్షల తేదీలు కూడా ప్రకటించినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ 
1. ‘India Today’ ఆర్టికల్ – https://www.indiatoday.in/education-today/news/story/shiv-charan-yadav-47th-10th-board-exams-77-year-old-311750-2016-03-04
2. ‘News 18’ ఆర్టికల్ – https://hindi.news18.com/photogallery/82-year-old-shiv-charan-yadav-fail-in-class-ten-exams-for-47th-time-889304.html
3. ‘Board of Secondary Education – Rajasthan’ వెబ్ సైట్ – http://rajeduboard.rajasthan.gov.in/

Did you watch our new video?

Share.

About Author

Comments are closed.

scroll