Fake News, Telugu
 

ముందుగానే నిర్ణయించిన రెండవ ఇండియా – నార్డిక్ సమ్మిట్‌లో భాగంగా నార్డిక్ దేశ ప్రధానులు ప్రధాని మోదీని కలిసారు

0

‘యురోప్ టూర్‌లో ఉన్న మన మోదీ గారిని కలవాలనుకున్న 9 ఐరోపా దేశాల ప్రధానులు. మోదీ గారి టైట్ షెడ్యూల్ వలన ఆయన విలువైన సమయాన్ని గుర్తించి, అర్థం చేసుకుని డెన్మార్క్ లోనే ఉండమని అక్కడకే వాళ్లంతా వెళ్లి కలవడం జరిగింది’ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మోదీ యురోప్ టూర్‌లో తొమ్మిది మంది ఐరోపా దేశాల ప్రధానులు స్వయంగా డెన్మార్క్ వచ్చి మోదీని కలిసారు.

ఫాక్ట్ (నిజం): ఇటీవల జరిగిన యూరప్ పర్యటనలో భాగంగా డెన్మార్క్ లో మోదీ పలు ఐరోపా దేశాల ప్రధానులు కలిసారు. ఐతే వీరు ప్రత్యేకించి మోదీని కలవడానికి ఆకస్మికంగా డెన్మార్క్ రాలేదు. డెన్మార్క్ లో ముందుగానే నిర్ణయించిన రెండోవ ఇండియా – నార్డిక్ సమ్మిట్‌లో భాగంగా నార్డిక్ దేశ ప్రధానులు (డెన్మార్క్, ఐస్లాండ్, నార్వే, ఫిన్లాండ్ మరియు స్వీడన్) మోదీని కలిసారు. ఈ కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల మొదట్లో మూడు దేశాల (జర్మనీ, డెన్మార్క్ మరియు ఫ్రాన్స్) దేశాల యూరప్ పర్యటన చేసారు. ఐతే పోస్టులో చెప్తున్నట్టు ఈ పర్యటనలో భాగంగా డెన్మార్క్ లో మోదీని ఐరోపా దేశాల ప్రధానులు కలిసిన మాట నిజమైనప్పటికీ, ఇది ఆకస్మికంగా జరిగిన సమావేశం కాదు, వీరు ప్రత్యేకించి మోదీని కలవడానికి మాత్రం రాలేదు.

ముందుగానే నిర్ణయించిన ఇండియా – నార్డిక్ రెండో సమ్మిట్‌లో భాగంగా వీరు మోదీని డెన్మార్క్ లో కలిసారు. యూరప్ పర్యటనలో భాగంగా డెన్మార్క్ పర్యటన అనతరం, డెన్మార్క్ లోనే ఇండియా – నార్డిక్ సమ్మిట్‌ జరిగింది, ఈ సమ్మిట్‌లో భాగంగా మోదీ నార్డిక్ దేశ ప్రధానులను (డెన్మార్క్, ఐస్లాండ్, నార్వే, ఫిన్లాండ్ మరియు స్వీడన్) కలిసారు.

ముందుగా ఈ దేశ ప్రధానులతో విడివిడిగా సమావేశమైన తరవాత అందరితో కలిసి ఇండియా – నార్డిక్ రెండో సమ్మిట్‌లో పాల్గొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, రష్యా – యుక్రెయిన్ యుద్ధం మొదలైన అంశాలపై వీరు చర్చించారు. మొదటి ఇండియా – నార్డిక్ సమ్మిట్‌ 2018లో స్వీడన్‌లో జరగగా, ఇప్పుడు డెన్మార్క్ లో జరిగింది రెండోది. 

ఈ సమావేశానికి సంబంధించి మోదీతో పాటు పలు నార్డిక్ దేశ ప్రధానులు చేసిన ట్వీట్స్ బట్టి కూడా ఇది ముందుగానే నిర్ణయించిన సమావేశమని స్పష్టమవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ).  దీన్నిబట్టి  నార్డిక్ దేశాల ప్రధానులు ఇండియా – నార్డిక్ సమ్మిట్‌ కోసం డెన్మార్క్ వచ్చారు గాని, మోదీని కలవడానికి ప్రత్యేకించి రాలేదు.

చివరగా, ముందుగానే నిర్ణయించిన రెండోవ ఇండియా – నార్డిక్ సమ్మిట్‌లో భాగంగా నార్డిక్ దేశ ప్రధానులు మోదీని కలిసారు. వీరు ప్రత్యేకించి మోదీని కలవడానికి డెన్మార్క్ రాలేదు.

Share.

About Author

Comments are closed.

scroll