Fake News, Telugu
 

కొలంబోలో ప్రదర్శనకారులు, ప్రభుత్వ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన ఫోటోలను తప్పుగా షేర్ చేస్తున్నారు

0

తమ దేశం దివాళాతీసి అంతర్యుద్ధం దిశగా పయనించడానికి మత మార్పిళ్ల ముఠాలే కారణమని పాస్టర్లను రోడ్లపైకీడ్చి చితకబాదుతున్న లంకేయులు”, అని చెప్తూ రెండు ఫోటోలతో కూడిన పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: శ్రీలంకలోని తాజా ఆర్ధిక పరిస్థితికి మత మార్పిళ్ల ముఠాలే కారణమని పాస్టర్లను అక్కడి ప్రజలు రోడ్లపైకి ఈడ్చి కొడుతున్న ఫోటోలు.

ఫాక్ట్: కొలంబోలోని మహీంద రాజపక్సే నివాసం వెలుపల ప్రదర్శనకారులు మరియు ప్రభుత్వ మద్దతుదారుల మధ్య తాజాగా జరిగిన ఘర్షణకు సంబంధించిన ఫోటోలు అవి. ఆ ఘర్షణల్లో కేవలం క్రైస్తవ మతానికి చెందిన పాస్టర్లపైనే కాదు, ఇతర వ్యక్తులపై కూడా దాడి జరిపారు. అంతేకాని, పోస్ట్‌లో చెప్పినట్టు వారే శ్రీలంక తాజా ఆర్ధిక పరిస్థితికి కారణమని పాస్టర్లను అక్కడి ప్రజలు రోడ్లపైకి ఈడ్చి కొట్టలేదు. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లో ఫోటోలను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, ఆ ఫోటోలు ‘Getty Images’ వెబ్‌సైట్‌లో ఉన్నట్టు తెలిసింది. ఆ ఫోటోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ‘Getty Images’ వెబ్‌సైట్‌లో ఆ ఫోటోల వివరణ – “09 మే 2022న కొలంబోలోని అధ్యక్ష కార్యాలయం వెలుపల ప్రదర్శనకారులు మరియు ప్రభుత్వ మద్దతుదారులు ఘర్షణ పడ్డారు” (తెలుగు అనువాదం), అని రాసి ఉన్నట్టు చూడవచ్చు. అంతేకానీ, పోస్ట్‌లో చెప్పినట్టు లేదు.

ఆ ఘర్షణల్లో కేవలం క్రైస్తవ మతానికి చెందిన పాస్టర్లపైనే కాదు, ఇతర వ్యక్తులపై కూడా దాడి జరిపారు. ఆ ఫోటోలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, కొలంబోలో ప్రదర్శనకారులు మరియు ప్రభుత్వ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన ఫోటోలను తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll