దెబ్బలతో ఉన్న ఒక వ్యక్తి ఫోటో పెట్టి, ఢిల్లీ లో గణతంత్ర దినోత్సవం రోజున ట్రాక్టర్ ర్యాలీ లో నిహంగ్ సిక్కు చేసిన ఆక్షన్ (పోలీసు పై కత్తి లేపినందుకు) కి రియాక్షన్ ఇది అని చెప్తూ, ఒక పోస్ట్ ని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ట్రాక్టర్ ర్యాలీ లో పోలీసు పై కత్తి లేపిన నిహంగ్ సిక్కు తర్వాత దెబ్బలతో ఉన్న ఫోటో.
ఫాక్ట్: దెబ్బలతో ఉన్న వ్యక్తి ఫోటో గణతంత్ర దినోత్సవం ట్రాక్టర్ ర్యాలీ తరువాత తీసినది కాదు. ఢిల్లీ లో జరుగుతున్న రైతుల నిరసనలో పాల్గొనడానికి డిసెంబర్ 2020లో వెళ్తుండగా ఒక ప్రమాదంలో ఫోటోలోని వ్యక్తికి గాయాలయ్యాయి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
నిహంగ్ సిక్కు పోలీసు పై కత్తి లేపిన ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఆ ఫోటో గణతంత్ర దినోత్సవం రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ కి సంబంధించినది అని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఆర్టికల్ లో చూడవొచ్చు.
దెబ్బలతో ఉన్న వ్యక్తి ఫోటో గురించి వెతకగా, ఆ ఫోటోని డిసెంబర్ 2020 నుండి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్టు తెలిసింది. ఢిల్లీ లో జరుగుతున్న రైతుల నిరసనలో పాల్గొనడానికి డిసెంబర్ లో వెళ్తుండగా ఒక ప్రమాదంలో ఫోటోలోని వ్యక్తికి గాయాలు అయినట్టు శిరోమణి అకాలీ దళ్ ఎంఎల్ఏ బిక్రం మరియు ‘కిర్తి కిసాన్ యూనియన్’ డిసెంబర్ 2020 లో పోస్ట్ చేసినట్టు చూడవొచ్చు. వారి పోస్టుల ఆధారంగా ‘న్యూస్18-పంజాబ్’ ప్రచురించిన ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు. కాబట్టి, దెబ్బలతో ఉన్న వ్యక్తి ఫోటో పాతది. ఆ ఫోటో గణతంత్ర దినోత్సవం ట్రాక్టర్ ర్యాలీ తరువాత తీసినది కాదు మరియు ఫోటోలో ఉన్న వ్యక్తికి ప్రమాదంలో దెబ్బలు తగిలాయి.
చివరగా, పోస్ట్ లో దెబ్బలతో ఉన్న వ్యక్తి ఫోటో పాతది; ఒక ప్రమాదంలో ఆ వ్యక్తికి గాయాలయ్యాయి.