Fake News, Telugu
 

‘త్వరలో భారతదేశం అంతా ఇస్లాం గెలుస్తుంది’ అంటూ ‘ఆప్’ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ట్వీట్ చేయలేదు

0

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరపున అమానతుల్లా ఖాన్ 2020 ఢిల్లీ ఎన్నికల్లో ‘ఓఖ్లా’ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచాడు. పౌరసత్వ సవరణ బిల్లు కి వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్న ‘షహీన్ బాగ్’ ప్రాంతం ఆ నియోజకవర్గం కిందకే వస్తుంది. అమానతుల్లా ఖాన్ పేరిట ఉన్న ఒక ట్వీట్ యొక్క స్క్రీన్ షాట్ ని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ ట్వీట్ ఈ విధంగా ఉంది- ‘13 రౌండ్లు పూర్తి చేసిన తరువాత నేను 72000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాను…ఈ రోజు షాహీన్ బాగ్ గెలిచింది, ఈ రోజు మన ఇస్లాం గెలిచింది. త్వరలో భారతదేశం అంతా ఇస్లాం గెలుస్తుంది. నా ముస్లిం తోబుట్టువులందరికీ ధన్యవాదాలు, అందరూ కలిసి తమ బలాన్ని చూపించారు. ఐక్యతను కొనసాగించండి, మనం ఖచ్చితంగా చరిత్రను పునరావృతం చేస్తాము’. అమానతుల్లా ఖాన్ నిజంగా ఆ ట్వీట్ చేశాడో లేదో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘త్వరలో భారతదేశం అంతా ఇస్లాం గెలుస్తుంది…’ అంటూ ‘ఆప్’ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ట్వీట్ చేసాడు.    

ఫాక్ట్ (నిజం): పోస్టులోని స్క్రీన్ షాట్ మార్ఫ్ చేయబడినది. ‘ఆప్’ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ 2020 ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న రోజున (11 ఫిబ్రవరి 2020) తన ట్వీట్ లో ‘13 రౌండ్లు పూర్తి చేసిన తరువాత నేను 72000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాను’ అని మాత్రమే రాసాడు. కావున, పోస్టులో చెప్పింది తప్పు.    

2020 ఢిల్లీ ఎన్నికలు ‘8 ఫిబ్రవరి 2020’ న జరిగాయి మరియు దాని ఫలితాలు ‘11 ఫిబ్రవరి 2020’ న వెలువడ్డాయి. స్క్రీన్ షాట్ లోని ట్వీట్ అమానతుల్లా ఖాన్ ‘11 ఫిబ్రవరి 2020’ తేదీన చేసినట్లుగా ఉంది. అమానతుల్లా ఖాన్ ట్విట్టర్ ఖాతాలో చూసినప్పుడు, ఆయన ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న రోజున తన ట్వీట్ లో ‘13 రౌండ్లు పూర్తి చేసిన తరువాత నేను 72000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాను’ అని  మాత్రమే రాసినట్లుగా ఉంది. అందులో ఆయన స్క్రీన్ షాట్ లో ఉన్న వ్యాఖ్యలు చేయలేదు.

స్క్రీన్ షాట్ లోని ట్వీట్ లో వాఖ్యాలు వేరు వేరు ‘ఫాంట్’ లతో ఉన్నట్లుగా చూడవచ్చు. ట్విట్టర్  లో ఒకే ట్వీట్ లో వేరు వేరు ‘ఫాంట్’ లతో రాయడం సాధ్యపడదు. కావున, పోస్టులోని స్క్రీన్ షాట్ మార్ఫింగ్ చేసినది.

చివరగా, ‘ఆప్’ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ట్విట్టర్ లో మతపరమైన వ్యాఖ్యలతో ట్వీట్ పెట్టినట్లుగా ఉన్న స్క్రీన్ షాట్ మార్ఫ్ చేసినది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll