Fake News, Telugu
 

ఇతర దేశాల్లోని యూదుల గురించి ఇజ్రాయెల్ ఇటీవల ఐక్యరాజ్య సమితిని ప్రశ్నించింది అని చెప్తూ పాత వీడియో షేర్ చేస్తున్నారు

0

వారి దేశాల్లోని యూదుల సంఖ్య ఎంత అని కొన్ని అరబ్ దేశాలని ఇజ్రాయెల్ ఐరాస (ఐక్యరాజ్య సమితి)లో  ఇటీవల ప్రశ్నించింది అని చెప్తూ ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. “ఐరాసలో ఇజ్రాయెల్ ప్రపంచాన్ని అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఈజిప్ట్, సిరియా, అల్జీరియా మరియు ఇరాక్‌లలో స్థిరపడిన లక్షలాది యూదులు ఎక్కడికి వెళ్లారు?వారిని ఊచకోత కోయలేదా?” పోస్ట్ యొక్క వివరణ చెప్తుంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్‌లోని హిందువుల సంఖ్యను కూడా భారతదేశం ప్రశ్నించాలని పిలుపునిస్తూ ఈ క్లిప్ వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఈ క్లెయిమ్ యొక్క వాస్తవాలను తెలుసుకుందాం. 

క్లెయిమ్: ఇటీవల ఇజ్రాయెల్ ఐక్యరాజ్య సమితిలో అరబ్ దేశాల వారిని తమ దేశాలలోని  యూదుల జనాభా గురించి ప్రశ్నించింది .

ఫాక్ట్(నిజం): ఈ వీడియో ఇప్పటిది కాదు. వైరల్ క్లిప్ 2017 మార్చిలో UN మానవ హక్కుల మండలి (UN Human Rights Council) చర్చ సందర్భంగా UN వాచ్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హిల్లెల్ న్యూయర్ చేసిన ప్రసంగంలోని ఒక భాగం. కావున, పోస్ట్‌లో చేసిన దావా తప్పుదోవ పట్టించేలాగా ఉంది.

వైరల్ వీడియోపై మా పరిశోధన ఇంటర్నెట్‌లో కీ వర్డ్ సెర్చ్‌తో ప్రారంభమైంది, ఇది వైరల్ క్లిప్ భాగమైన  పూర్తి ప్రసంగానికి దారితీసింది. ఈ ప్రసంగం UN వాచ్ యొక్క YouTube ఛానెల్, Facebook పేజీ మరియు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

ఈ వీడియో మార్చి 2017 నాటిది, ఇజ్రాయెల్‌ను లక్ష్యంగా చేసుకునే అజెండా అంశం కింద జరిగిన UN మానవ హక్కుల మండలి (UN Human Rights Council) చర్చకి చెందింది (debate held under an agenda item targeting Israel). పాలస్తీనాపై ఇజ్రాయెల్ ఉగ్రవాద చర్యలు చేస్తుంది అనే ఆరోపణలపై అనేక దేశాలు తమ దృక్కోణాలను వ్యక్తం చేశాయి.

UN వాచ్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హిల్లెల్ న్యూయర్,ఈ అభిప్రాయాలకు తన కౌంటర్ నరేటివ్ అందించారు. ఒరిజినల్ క్లిప్‌లోని టైమ్‌స్టాంప్ 2:43 నుండి మీరు దిన్ని చూడవచ్చు. ఈజిప్ట్, అల్జీరియా, సిరియా, ఇరాక్ మరియు ఇతర దేశాలలో యూదుల జనాభాపై కమిషన్ ఇచ్చిన నివేదికను న్యూయర్ ప్రశ్నించారు. వైరల్ వీడియో న్యూయర్ ప్రసంగంలో నుండి తీసిన ఒక చిన్న క్లిప్.

వైరల్ వీడియోతో పాటుగా ఉన్న వివరణ న్యూయర్ ప్రసంగాన్ని ఇజ్రాయెల్‌కు తప్పుగా ఆపాదించింది, ఇటీవలిది అని తప్పుగా చెప్పింది. 

చివరిగా, వైరల్ వీడియో 2017లో UN వాచ్‌కి చెందిన హిల్లెల్ న్యూయర్ చేసిన ప్రసంగం నుండి తీసుకున్నది, ఇది ఇజ్రాయెల్‌కు సంబంధించిన ఇటీవలి సంఘటన కాదు.

Share.

About Author

Comments are closed.

scroll