Fake News, Telugu
 

ఫోటో వెంకయ్యనాయుడు రాజ్యసభ లో జైపాల్ రెడ్డి సంస్మరణ చదువుతూ కంటతడి పెట్టినప్పటిది

1

ఫేస్బుక్ లో ఒక ఫోటో ని పెట్టి “రాజ్యసభలో ‘దిశ’ హత్య విషయంలో జరిగిన చర్చలో కన్నీరు పెట్టిన రాజ్యసభ చైర్మన్ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు” అని పోస్టు చేస్తున్నారు. పోస్టులో చెప్పినదాంట్లో ఎంతవరకు నిజముందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రాజ్యసభలో ‘దిశ’ హత్య విషయంలో జరిగిన చర్చలో కన్నీరు పెట్టిన వెంకయ్య నాయుడు ఫోటో

ఫాక్ట్ (నిజం): ఫోటో వెంకయ్యనాయుడు రాజ్యసభ లో జైపాల్ రెడ్డి సంస్మరణ చదువుతూ కంటతడి పెట్టినప్పటిది. కావున, పోస్టు ప్రక్కద్రోవ పట్టించేలా ఉంది.

షాద్‌నగర్ ‘దిశ’ ఘటనపై రాజ్యసభ లో జరిగిన చర్చ గురించి ‘News18’ మరియు ‘Mana Telangana’ వార్తా సంస్థలు రాసిన కథనాల్లో కూడా అదే ఫోటో ఉన్నట్లుగా ఇక్కడ (ఆర్కైవ్డ్) మరియు ఇక్కడ (ఆర్కైవ్డ్) చూడవచ్చు. కానీ, గూగుల్ లో ‘Venkaiah naidu breaks down in rajya sabha’ అని వెతికినప్పుడు, సెర్చ్ రిజల్ట్స్ వెంకయ్యనాయుడు రాజ్యసభ లో జైపాల్ రెడ్డి సంస్మరణ చదువుతూ కంటతడి పెట్టడం గురించి వచ్చాయి. అదే విషయం గురించి ‘Deccan Herald’ రాసిన కథనం లో పోస్టులోని ఫోటోని చూడవచ్చు. ఆ కథనం ద్వారా జులై 29, 2019 లో వెంకయ్యనాయుడు రాజ్యసభ లో జైపాల్ రెడ్డి సంస్మరణ చదువుతూ, తనకూ జైపాల్ రెడ్డి కీ ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నపుడు కంటతడి పెట్టినట్లుగా తెలిసింది.

చివరగా, ఫోటో వెంకయ్యనాయుడు రాజ్యసభ లో జైపాల్ రెడ్డి సంస్మరణ చదువుతూ కంటతడి పెట్టినప్పటిది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll