Fake News, Telugu
 

ఫోటోలోని యువతి పేరు మత్తి రేవతి. ఆమె ఎంపిక అయింది SI పోస్ట్ కి, కలెక్టర్ గా కాదు.

0

రేవతి అనే ఒక యువతి పేద కుటుంబం నుండి వచ్చి కలెక్టర్ గా ఎంపిక అయింది అని ఉన్న ఒక పోస్ట్ ఫేస్బుక్ లో విస్తృతంగా ప్రచారం అవుతుంది. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పేద కుటుంబం నుండి వచ్చి కలెక్టర్ గా ఎంపిక అయిన రేవతి ఫోటో.    

ఫాక్ట్ (నిజం): ఫోటోలోని అమ్మాయి పేరు మత్తి రేవతి. అవనిగడ్డ అనే గ్రామానికి చెందిన ఆమె 2017లో సబ్ ఇన్స్పెక్టర్ (SI) గా ఎంపిక అయింది, పోస్ట్ లో చెప్పినట్టు కలెక్టర్ గా కాదు. 2017 లో ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎంపిక అయిన SI సెలక్షన్ లిస్ట్ లో ఆమె పేరు చూడవొచ్చు.  కావున, పోస్ట్ లోని క్లెయిమ్ అబద్ధం.    

ఫోటోలోని అమ్మాయి ఐఏఎస్ (సివిల్స్ పరీక్షలో) మూడవ ర్యాంకు సాధించిందని ఉన్న ఒక ట్వీట్ ని అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా 2017 లో షేర్ చేసినట్టు ఇక్కడ (ఆర్కైవ్డ్) చూడవొచ్చు. గుజరాత్ ప్రభుత్వ మంత్రి భూపేంద్ర సిన్హ కూడా ఫోటోలోని అమ్మాయి ఐఏఎస్ కి ఎంపిక అయినట్టు ట్వీట్ (ఆర్కైవ్డ్) చేసారు. కానీ, 2017 లో వెలువడిన 2016 యుపి‌ఎస్‌సి సివిల్స్‌ పరీక్ష ఫలితాల్లో రేవతి పేరు లేదు.

ఆ పోస్టులోని ఫోటోను గూగుల్ లో సెర్చ్ చేస్తే ‘journalismpower.com’ అనే వెబ్సైట్ లో అదే ఫోటో తో ఉన్న ఒక ఆర్టికల్ కనిపించింది. ఆ ఆర్టికల్ ద్వారా ఆమె పేరు మత్తి రేవతి అని, అవనిగడ్డ అనే గ్రామానికి చెందిన ఆమె ఓపెన్ కేటగిరీ లో సబ్ ఇన్స్పెక్టర్ (SI) పోస్ట్ కి ఎంపిక అయింది అని తెలిసింది. అదే విషయాన్నీ ఫేస్బుక్ లో ‘మన అవనిగడ్డ’ అనే గ్రూప్ లో కూడా పోస్ట్ చేసినట్టు చూడవొచ్చు; అంతేకాక, ఆ పోస్ట్ లోని ఒక ఫోటో లో ‘శివాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్’ ప్రచురించిన ఒక కర పత్రంలో మత్తి రేవతి ఫోటో చూడవచ్చు, అందులో ఆమె SI పోస్ట్ కి సెలెక్ట్ అయిందని ఉండడం గమనించవచ్చు. ‘శివాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్’ వారి ఫేస్బుక్ పేజీలో రేవతి గురించి వార్తాపత్రికలు

ప్రచురించిన ఆర్టికల్స్ మరియు రేవతిని సన్మానించిన ఫోటోలు కూడా చూడవొచ్చు.

అంతేకాక, ఈనాడు పేపర్ లో ప్రచురించిన 2017 సబ్ ఇన్స్పెక్టర్ (SI) సెలక్షన్ లిస్ట్ లో (zone-ii లో 40) ‘మత్తి వెంకట రేవతి’ పేరు ఉండడం చూడవచ్చు.

చివరగా, మత్తి రేవతి అనే యువతి ఎంపిక అయింది కలెక్టర్ గా కాదు. ఆమె 2017 లో సబ్ ఇన్స్పెక్టర్ (SI) పోస్ట్ కి ఎంపిక అయింది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll